విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Saturday, January 24, 2009

బ్రహ్మంగారి కాలజ్ఞానం


రాముడైనా నేనే కృష్ణుడైనా నేనే
సర్వంబు నేనని తెలియండయా
వాడ భేదములేల శ్రీ వేంకటేశుడై
ధరణిలో వెలసినది నేనేనయా..

అంతటి కృష్ణుడు అందగాయుందియూ
పాండవులు పడరాని కష్టాలు పడ్డారయా
రాజది రాజులై భిక్షమెత్తారు దైవలీలలు
కనగ ఎవ్వరికీ తరమౌను ...

నన్ను తలచిన యెడల నా దర్సనంబిత్తు
సత్యమ్బు నా మాట నమ్మందయా
మాయ శక్తులు చేయు ప్రళయంబులెన్నైన
మ్మిమంటబోవని తెలియండయా ...

నన్ను తలచిన వారు నామయ యటంచు
ఐశ్వర్యవంతులుగా నుండేరయా
ఎట్టి ఆపదలైనా ఎన్ని కష్టములైన
నేనుండి తొలగింతు నమ్మండయా ... ఇంకా వుంది

మనిషికి తెలియని మర్మమేది లేదు
తానెవరో మాత్రము తెలియలేదు
బయటి విషయముల తెలియు తననుండి తెలియదు
తన్ను తానేరుగుతకు తీరికేయుండదు. ...

సూర్యుని తేజస్సు క్రమముగా తగ్గెను
జీవరాశులు ఎన్నో నశియించి పోయెను
శాస్త్రవేత్తలకడి గోచరము కాకుండా
దైవమే గతియని ప్రార్ధనలు చేసేరు....

బాహ్య విషయములకై పరుగెత్తినావంటే
ఏడ్పించి నీ పై స్వారీ జేసెను
పరమాత్మ వైపున మనస్సు నిలిపావంటే
ప్రకృతే నీ పాద సేవ జేసెను...

మంచితనమునకు మించు శక్తేది బలమేది
ఉజ్వల మైనట్టి సుగుణంబురా
మంచి వాని మంచి సుఖ సౌఖ్యములనిచ్చు
చెడు సర్వనాశనం జేసేనురా ...

భ్రమలు తిప్పగా లేక బానిసగా బ్రతికేరు
సత్యంబు అన్నది తెలియండయా
మానవ జన్మము దొరికేది దుర్లభము
దేవతలు దీనికి వగచేరయా...

కన్నా యోనులయండు పుట్టి గిట్టుచునుండా
కడగండ్లు ఏనాడు తీరేదయ
ఖర్మలే జన్మలకు మూలమని తెలుసుకుని
కడతేరు మార్గంబు వెతకండయా ...

వ్రతములు పూజలు తీర్ధ యాత్రలు జేసి
జఘనుల మనుచు విర్రవీగెరయ
కపట కల్మషము కడుపులో నుండగా
అవిఎల్ల దండగే తెలియండయా ...

వేదాన్తులమనుచు విర్రవీగుచు జనులు
వెర్రివెర్రిగా ఏదో పలికేరాయ
మనసు నిలుపగాలేరు మోక్షమందగాలేరు
మండభాగ్యులకెల ఈ గొడవయ ......

బ్రహ్మంగారి కాలజ్ఞానం
వీరబ్రహ్మము యొక్క వేద వాక్యంబులు
ధరణిలో తప్పక జరిగేనయా
కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు
కడతేరు మార్గంబు వెతకండయా!

స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు
సర్వేశ్వరుని తప్ప తెలియండయా
సూర్యచంద్రాదులు, సర్వగ్రహంబులు
ఆ వెలుగుతో వెలుగుచున్నాయరా!

అనంత విశ్వములో ఈ గోళమెంతరా?
ఇందులో వున్నట్టి నీశక్తి యెంతరా?
సర్వమును కాపాడు సర్వశక్తిని నీవు,
శరణు బొందుటే నీదు ధర్మంబురా!

కోటీశ్వరునికైన కోటి చింతలు వుండు
చింతలేని బ్రతుకు వెతకాలిరా
చింతలపాలైన సిరికి బానిసలయి
శాంతినే కోల్పోయి యేడ్చేరయా!

వచ్చింది తెలియదు పోయేది తెలియదు
మధ్యలో మన బ్రతుకు ఏమౌనో తెలియదు
ఏమి తెలియని జన్మ కెందుకుర గర్వంబు
అందరిని కాపాడు ఆది పురుషుని నమ్ము!

తనకున్న సంపదను పేరు ప్రతిష్టలను
చెప్పుకొని గర్వించు చుంటారయా
మూన్నాళ్ల బ్రతుకిది యముడు వచ్చాడంటే
మీ గొప్ప ఏమిటో తెలియండయా!

నావారు ఉన్నారు నా ఆస్థులున్నాయి
నా కేమి తక్కువని మురిసేరయా
కాలంబు తీరెనా ఈ లోకము నుండి
తరిమివేయ బడును తెలియండయా!

నాది నాది యనుచు గర్వించి చెప్పేరు
తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు
ఆరు అడుగుల నేల అందరిని పూడ్చుటకు,
అదియును మీదని ఎవరు చెప్పారు?

చేతిలోని ముద్ద నోటి లోనికి పోదు
శివునాజ్ఞ లేనిదే తెలియండయా
సర్వంబు నేననుచు గర్వంబుతో
జడుడు సర్వనాశన మొంది సచ్చేరయా!

ఈ లోకమందున పుట్టినందుకు నీవు
గుర్తునకు ఏదైనా మంచి జేసి వెళ్లు
లేకున్న క్రిములకు నీకు తేడా యేమి
ఇంకెంత కాలంబు బ్రతికేవురా!

నీ తల్లి పార్వతీ నీ తండ్రి శంకరుడు,
ఆలి మాయా శక్తి అంశంబురా
నీ కన్నబిడ్డలే గణపతాంశము తెలియ
అట్టి వారి మెప్పు పొందాలిరా!

సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు
చేసే మహా శక్తి మనిషిలో ను ఉంది
నీలోని శక్తిని భక్తిని ధ్యానింప
ఆదైవ దర్శనం కలిగేనయా!

ఎన్ని విద్యలు నేర్చి ఎంత చదివినగాని
ప్రతిక్షణము చావుతో పోట్లాటయా
చావు లేని చదువు నేర్వంగ జాలరు
ఇది యేమి కర్మమో తెలియండయా!

దానంబు చేయకే దరిద్రులయ్యేరు
దైవమును నిందింప ఫలమేమయ
పదుగురికి ధర్మంబు చేసిన పుణ్యమే
జన్మ జన్మకు వెంట వచ్చేనయా!

మీరేది చల్లేరో అదియే పండును గాని
లేని దానికి ఏల యేడ్చేరయా
కర్మలకు దేవునికి సంబంధమే లేదు
ప్రకృతియే దీనికి మూలంబయా!

ఆత్మలో న మార్పు కలిగినప్పుడేగాని
తత్వంబు మారునని తెలియండయా
వేషభాషలు పెంచి వేయి విద్యలు
నేర్వ వెతలెట్లు పోవునో తెలియండయా

మతముల పేరిట మత్సరంబులు పెరిగి
మదియించి కొట్టుకొని సచ్చేరయా
మనువు వంశం నుండి మనుషులందరూ పుట్టు
మతము లెన్నుండునో తెలియండయా!

బ్రహ్మంగారి కాలజ్ఞానం
వీరబ్రహ్మము యొక్క వేద వాక్యంబులు
ధరణిలో తప్పక జరిగేనయా
కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు
కడతేరు మార్గంబు వెతకండయా!


స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు
సర్వేశ్వరుని తప్ప తెలియండయా
సూర్యచంద్రాదులు, సర్వగ్రహంబులు
ఆ వెలుగుతో వెలుగుచున్నారయా!


అనంత విశ్వములో ఈ గోళమెంతరా?
ఇందులో వున్నట్టి నీ శక్తి యెంతరా?
సర్వమును కాపాడు సర్వ శక్తివి నీవు
సరణు బొందుటే నీదు ధర్మంబురా!


కోటీశ్వరునికైన కోటి చింతలు వుండు
చింతలేని బ్రతుకు వెతకాలిరా
చింతలాపాలైన సిరికి బానిసలయి
శాంతినే కోల్పోయి యేడ్చేరయా!


వచ్చింది తెలియదు పోయేది తెలియదు
మధ్యలో మన బ్రతుకు ఏమౌనో తెలియదు
ఏమి తెలియని జన్మ కెందుకుర గర్వంబు
అందరిని కాపాడు ఆది పురుషుని నమ్ము!


తనకున్న సంపదను పేరు ప్రతిష్టలను
చెప్పుకొని గర్వించు చుంటారయా
మూన్నాళ్ళ బ్రతుకిది యముడు వచ్చాడంటే
మీ గొప్ప ఏమిటొ తెలియండయా!


నావారు ఉన్నారు నా ఆస్తులున్నాయి
నాకేమి తక్కువని మురిసేరయా
కాలంబు తీరినా ఈ లోకము నుండి
తరిమివేయ బడును తెలియండయా!


నాది నాది యనుచు గర్వించి చేప్పేరు
తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు
ఆరు అడుగుల నేల అందరిని పూడ్చుటకు
అదియును మీదని ఎవరు చెప్పారు?


చేతిలోనీ ముద్ద నోటి లోనికి పోదు
శివునాజ్ఞా లేనిదే తెలియండయా
సర్వంబు నేననుచు గర్వంబుతో
జడుడు సర్వనాశన మొంది సచ్చేరయా!


ఈ లోకమందున పుట్టినందుకు నీవు
గుర్తునకు ఏదైనా మంచి జేసి వెళ్ళు
లేకున్న క్రిములకూ నీకు తేడా యేమి
ఇంకెంత కాలంబు బ్రతికేవురా!


నీ తల్లి పార్వతీ నీ తండ్రి శంకరుడు
ఆలి మాయ శక్తి అంశంబురా
నీ కన్నబిడ్డలే గణపతాంశము తెలియ
అట్టి వారి మెప్పు పొందాలిరా!

బ్రహ్మంగారి కాలజ్ఞానం
చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని
చేరి మ్రొక్కితే బ్రతక నేర్చేరూ.

చెప్పలేదంటనక పొయ్యేరు
తప్పదిదిగో గురుని వాక్యము
తప్పు ద్రోవల బోవు వారల
చప్పరించి మ్రింగు శక్తులు
ముప్పెతనమున మోసపొయ్యేరు అదిగాక కొందరు
గొప్పతనమున గోసుమీరేరు.

ఇప్పుడప్పుడనగరాదు
ఎప్పుడో ఏ వేలనో మరి
గుప్పు గుప్పున దాటి పోయేడు
గుర్రపడుగులు ఏరుపడును
తాకుతప్పులు తలచకున్నారు - తార్కాణమైతే
తక్కువెక్కువ తెలియనేర్తూరు

జోక తోడుత తల్లి పిల్లలు
జోడు బాసి అడవులందు
కాకి శోకము చేసి ప్రజలు
కాయ కసురులు నమిలి చత్తురు
కేక వేసియు ప్రాణమిడిచేరు - రాకాసి మూకలు
కాక బట్టి కలవరించేరు

ఆకసమ్మది ఎర్ర బారును
ఆరు మతములు ఒక్కటౌను
లోకమందలి జనములందరు
నీరునిప్పున మునిగి పోదురు
అగలు విడిచి పొగలు దాటేరు-అది గాక పట్ట
పగలు చుక్కలు చూసి భ్రమసేరు

భుగులు భుగులు ధ్వనులు మింటున
పుట్టియేగిన పిమ్మటాను
దిగులు పడుచూ ప్రజలు చాలా
దిక్కులేని పక్షులౌదురు
పాతకూతా పదట గలిసేరు -పరిపూత చరితులు
సాధువులు సంతసింతురు

భూతలంబున నిట్టి వింతలు
పుట్టియనగిన పిమ్మటాను
నీతికృతయుగ ధర్మమప్పుడు
నిజము నిలకడ మీద తెలియును
ఏమో ఏమో ఎరుగకున్నారు - ఎందెందు జూచిన
యముని పురికే నడవమన్నారు

భూమి మీదను ధూముధాములు
పుట్టిపెరిగిన పిమ్మటానూ
రామ రామ యనని వారలు
రాలిపోదురు కాలి పోదురు
ముందు వెనకలు గాన కున్నారు - మూర్ఖావలీ భువిలో
ముందు గతినే యెరగ కున్నారు

కందువతో పిన్న పెద్దల
కన్నుగానక గర్వములచే
మందే వేలములాడువారిని
బందు బందుగ గోతురక్కడ
కీడెయైనను కూడదందూరు - ఒనగూడినపుడు
యేడ జూచిన వాడుకొందురూ

సంగ్రహణం


నైమిశారణ్యం

జ్యోతిగారికి ధన్యవాదములు