విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం
విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం
Sunday, September 14, 2008
17న విశ్వకర్మ జయంతి సభ
విశ్వకర్మ జయంతి మహొత్సవ సభను ఈ నెల 17న విశాఖపట్నం లొని ప్రహ్లద మందిరంలొ నిర్వహించనున్నట్లు విశాఖ ఉడ్ డెకార్స్ వెల్పేర్ అసోసియేషన్ వ్వవస్థాపక అధ్యక్షుడు కానూరు లక్ష్మణరావు తెలిపారు. పెదగదిలి కార్పెంటర్లల సంఘం కార్యాలయంలొ శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సోసియేషన్ తరుపున కులమతాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాట్లు చెప్పారు. ఈ సభకు మంత్రి కొణతాల రామకృష్ణ, నగర ఎమ్మెల్యేలను ఆహ్వానించామన్నారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు పాటోజు వరహాచారి, అధికార ప్రతినిధి చుక్కా వీరాచారి, ప్రధాన కార్యదర్శి వేముల కన్నప్రసాద్, ఉపాధ్యక్షుడు గంగాడ కృష్ణ, కోశాధికారి బేతాల సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
Courtesy by eenaadu daily
Friday, September 5, 2008
Filed under: బ్రహ్మంగారి కాలజ్ఞానం
సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు
చేసే మహా శక్టి మనిషిలో ను ఉంది
నీలోని శక్తిని భక్తితో ధ్యానింప
ఆదైవ దర్శనము కలిగేనయా!
ఎన్ని విద్యలు నేర్చి ఎంత చదివినగాని
ప్రతిక్షణం చావుతో పోట్లాటయా
చావులేని చదువు నేర్వంగ జాలరు
ఇది యేమి కర్మమో తెలియండయా!
దానంబు చేయకే దరిద్రులయ్యేరు
దైవమును నిందింప ఫలమేమయ
పదుగురికి ధర్మంబు చేసిన పుణ్యమే
జన్మ జన్మకువెంట వచ్చేనయా!
మీరేది చల్లెదరో అదియే పండును గాని
లేని దానికి ఏల యేడ్చేరయా
కర్మలకు దేవునికి సంబంధమే లేదు
ప్రకృతియే దీనికి మూలంబయా!
ఆత్మలో న మార్పు కలిగినప్పుడేగాని
తత్వంబు మారునని తెలియండయా
వేషభాషలు పెంచి వేయి విద్యలు
నేర్వ వెతలెట్లు పోవునో తెలియండయా
మతముల పేరిట మత్సరంబులు పెరిగి
మదియించి కొట్టుకొని సచ్చేరయా
మనువు వంశము నుండి మనుషులందరు పుట్టు
మతం లెన్నుండునో తెలియండయా!
రాముడైనా నేనె కృష్ణుడైనా నేనె
సర్వంబు నేనని తెలియండయా
వాద భేదములేల శ్రీ వెంకటేశుడై
ధరణిలో వెలసినది నేనేనయా !
అంతటి కృష్ణుడు అండగాయుండియూ
పాండవులు పడరాని కష్టాలు పడ్డారయా
రాజాది రాజులే భిక్షమెత్తారు దైవలీలలు
కనగ యెవ్వరికి తరమౌను !
నన్ను తలచిన యెడల నా దర్శనంబిత్తు
సత్యంబు నా మాట నమ్మండయా
మాయ శక్తులు చేయు ప్రళయంబులెన్నైన
మ్మిమంటబొవని తెలియండయా!
నన్ను తలచిన వారు నా మాయ యటంచు
ఐశ్వర్యవంతులుగా నుండేరయా
యెట్టి ఆపదలైన యెన్ని కష్టములైన
నేనుండి తొలగింతు నమ్మండయా!
మనిషికి తెలియని మర్మమేది లేదు
తానెవరో మాత్రము తెలియలేదు
బయటి విషయముల తెలియు తననుండి తెలియదు
తన్ను తానెరుగుటకు తీరికేయుండదు!
సూర్యుని తేజస్సు క్రమముగా తగ్గెను
జీవరాశులు ఎన్నో నశియించి పోయేను
శాస్త్రవేత్తలకది గోచరము కాకుండ
దైవమే గతియని ప్రార్ధనలు జేసేరు.
సంగ్రహణం
నైమిశారణ్యం
జ్యోతిగారికి ధన్యవాదములు
Tuesday, May 27, 2008
రాష్త్ర విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్నికలు రసాభస
తేది:26-05-2007
ఓట్ల గల్లంతు పై రగడ
రాష్త్ర విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్నికలు రసాభస
విజయవాడ సిటీ, న్యూస్ టుడె : ఓట్ల గల్లంతుపై ఎర్పడిన వివాదం ప్రాంతీయ విభేదాలకు దారి తీసి రాష్త్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నికలు రసాభసగా మారాయి ఆదివారం విజయవాడలొని వన్ టౌన్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో జరిగిన ఈ ఎన్నికలు ప్రారంభం నుంచే అభ్యర్దుల మధ్య ప్రాంతీయ విభేదాలు పొడచూపాయి. ఇరువర్గాలవారు ఆంధ్రా, తెలంగాణా డౌన్ డౌన్ అంటు ఘర్షణకు దిగటంతొ పొలీసులు రంగప్రవేశం చేశారు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు ముగ్గురుచొప్పున బరిలో ఉన్న అభ్యర్దులు ఎవరికి వారు తమ ఓటర్లను ప్రత్యేక బస్సులలో రప్పించారు. తెలంగాణా ఓటర్లు తమ ఓట్లు గల్లంతయ్యాయని అభ్యంతరాలు లేవనెత్తటంతో ఏసీపీ విజయకుమార్ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేసి పోలింగ్ బూత్ లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నినాదాలుచేస్తున్న ఓటర్లను పొలీసులు చెదరగొట్టారు. ఒక దశలో స్వల్పలాఠీ ఛార్జి చేశారు. 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల వారు ఎన్నికలను బహిష్కరించి వెళ్లిపోగా తిరిగి 4 గంటలతర్వాత పోలింగ్ నిర్వహించారు. సభ్యత్వం ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం సమయానికి వచ్చిన సభ్యులనే ఓటు వేసేందుకు అనుమతించామని ఓట్ల గల్లంతు ఆరోపణల పై ఎన్నికల అధికారి వివరణ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటాచారి అధ్యక్షునిగా, విశాఖపట్నానికి చెందిన గోడి నరసింహాచారి ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారన్నారు.
Courtesy by eenaadu daily
Tuesday, April 1, 2008
మన గోత్రములు
మన గోత్రములు
మన భగవంతుడు పంచముఖుడు (ఐదు ముఖములు కలవాడు)
౧. మను అనె ముఖము యొక్క గోత్రం సనగ బ్రహ్మర్షి
౨. మయ అనె ముఖము యొక్క గోత్రం సనాతన బ్రహ్మర్షి
౩. త్వష్ట అనె ముఖము యొక్క గోత్రం అహభౌసన బ్రహ్మర్షి
౪. దైవజ్ఞ (శిల్పి) అనె ముఖము యొక్క గోత్రం ప్రత్నస బ్రహ్మర్షి
౫. విశ్వజ్ఞ అనె ముఖము యొక్క గోత్రం సుపర్ణస బ్రహ్మర్షి
౧. ఉప సనగ బ్రహ్మర్షి
౨. విభ్రజ బ్రహ్మర్షి
౩. కాశ్యప బ్రహ్మర్షి
౪. మను విశ్వకర్మ బ్రహ్మర్షి
౫. విశ్వాత్మక బ్రహ్మర్షి
II. సనాతన బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉప సనాతన బ్రహ్మర్షి
౨. వామ దేవ బ్రహ్మర్షి
౩. విశ్వ చక్షు బ్రహ్మర్షి
౪. ప్రతితక్ష బ్రహ్మర్షి
౫. సునందా బ్రహ్మర్షి
III. అహభౌసన బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉపభౌసన బ్రహ్మర్షి
౨. భద్ర దత్త బ్రహ్మర్షి
౩. ఖాండవ బ్రహ్మర్షి
౪. నిర్వికార బ్రహ్మర్షి
౫. శ్రీ ముఖ బ్రహ్మర్షి
IV. ప్రత్నస బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉప ప్రత్నస బ్రహ్మర్షి
౨. రుచి దత్త బ్రహ్మర్షి
౩. వాస్తోష్పతి బ్రహ్మర్షి
౪. కౌసల బ్రహ్మర్షి
౫. సనాభావ బ్రహ్మర్షి
V. సుపర్ణస బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉప సుపర్ణస బ్రహ్మర్షి
౨. విశ్వజ్ఞ బ్రహ్మర్షి
౩. పరితర్షి బ్రహ్మర్షి
౪. శూరసేన బ్రహ్మర్షి
౫. సాంఖ్యయాన బ్రహ్మర్షి
పైన పేర్కొన్న 25 ఉప గోత్రాలకు తిరిగి ఐదేసి ఉప గోత్రాలు కలవు.
విశ్వకర్మ
విశ్వకర్మ
ప్రతీ ముఖమునకు మహర్షి మరియు గోత్రరిషి కలవు
౧. మను అనగ శివుడు
౨. మయ అనగ విష్ణువు
౩. త్వష్ట అనగ బ్రహ్మ
౪. శిల్పి/దైవజ్ఞ అనగ ఇంద్ర
౫. విశ్వజ్ఞ అనగ సూర్య
పైన చెప్పబడిన ఐదు రూపాలకు ఐదుగురు బార్యలతో దేవాలయములు కలవు
ఈ ఐదు ముఖములకు ఐదుగురు బ్రహ్మర్షిలు కలరు
౧. సద్యోజాత బ్రహ్మర్షి
౨. వామ దేవ బ్రహ్మర్షి
౩. అఘోర బ్రహ్మర్షి
౪. తత్పురుస బ్రహ్మర్షి
౫. ఈసానన బ్రహ్మర్షి
ఈ ఐదుగురి బ్రహ్మర్షి లకు ఐదు స్తానములు కలవు మరియు 125 స్తానములు గల గోత్రర్షిలు కలవు