విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Thursday, September 17, 2009

విశ్వబ్రహ్మణులకు/విశ్వకర్మలకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు

విశ్వబ్రహ్మణులకు/విశ్వకర్మలకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు



Continue Reading... ని క్లిక్ చేయండి



పంచ శిల్ప బ్రహ్మలు


శ్లో నభూమి నజలం చైవ నతేజో నచ వాయవః
నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః
సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణః

తా భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము,
బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు
లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.

భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుజు, సహస్ర శిర్షుడు! సగుణ బ్రహ్మం, అంగుష్ట మాత్రుడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు – అనంతరూపములు కలిగినై. “ ప్రజాపతి విశ్వకర్మ మనః “ అని కృష్ణ యజుర్వేదమున విశ్వకర్మయే ప్రజాపతియైన బ్రహ్మయనియు చెప్పబడినది. ఆయనకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానము లనెడి నైదు ముఖలు.

శ్లో పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః
అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః

తా తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖము నందు సనాతన ఋషి, పశ్చిమ ముఖము నందు అహభూన ఋషి, ఉత్తర ముఖము నందు బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖము నందు సుపర్ణ ఋషులుద్బవించిరి.

విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతము నందు సానగబ్రహ్మర్షి మకుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవము నందు సనాతన మహర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ మహర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషము నందు ప్రత్న మహర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానము నందు సువర్ణ మహర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినై.


శ్లో మమశ్చ యీశ్వరోనామ విష్ణునామ మయస్ధధా
బ్రహ్మనామ భవేత్వష్టా శిల్పమహ్మేంద్ర నామశ్చ
విశ్వజ్ఞ సూర్యనామాశ్చాత్ విస్వకర్మాగ్రనందనః

తా నానుండి ఉద్భవించిన మనుబ్రహ్మ సాక్షాదీశ్వరుడు, మయబ్రహ్మ సాక్షాత్ నారాయణుడు, త్వష్ట బ్రహ్మ సాక్షాత్పితామహుడు, శిల్పి బ్రహ్మ సాక్షాత్ దేవేంద్రుడు, విశ్వజ్ఞబ్రహ్మ సాక్షాత్ సూర్యుడు వేదములందులుండినవి.


మనుబ్రహ్మకళ శివుడనియు, మయబ్రహ్మ కళ విష్ణువనియు, త్వష్ఠ బ్రహ్మ కళ బ్రహ్మయనియు , శిల్పి బ్రహ్మ కళ దేవేంద్రుడనియు, విశ్వజ్ఞబ్రహ్మ కళ సూర్యుడనియు వేదములు చెప్పుచున్నవి. విరాడ్విశ్వకర్మ పంచముఖాల నుండి పంచశిల్పి బ్రహ్మలుదయించినట్లే ఆయన శరీరార్ధము నుండి ఆదిశక్తి పరాశక్తి ఇచ్ఛాశక్తి క్రియశక్తి జ్ఞానశక్తులను పేరులందు నైదు శక్తులవతరించినై............. అందు ఆదిశక్తి యనంబడు పార్వతీదేవి సానగఋష్యంశ మనుబ్రహ్మయైన శివముర్తి నాదరించింది. పరాశక్తి యనంబడు లక్ష్మీదేవి సనాతన ఋష్యంశ మయబ్రహ్మయైన విష్ణుమూర్తి నావరించింది. ఇచ్ఛా శక్తి యనంబడు సరస్వతీదేవి ఆహభూన ఋష్యంశ త్వష్ట బ్రహ్మయైన బ్రహ్మమూర్తి నావరించింది. క్రీయా శక్తి యనంబడు శచీదేవి ప్రత్ని ఋష్యంశ శిల్పి బ్రహ్మయైన యింద్రమూర్తి నావరించింది. జ్ఞానశక్తియనంబడు సంజ్ఞాదేవి సువర్ణ ఋష్యంశ విశ్వజ్ఞ బ్రహ్మయైన సూర్యమూర్తి నావరించింది. మఱియు హనుమచ్ఛిల్ప శాస్త్రము నందు.

శ్లో తిధిరూపంచ మనుః ప్రోక్తమ్ వారంచ మయసంభవా
నక్షత్రం త్వష్ట రూపంచ శిల్పి యోగం తధైవచ
విశ్వజ్ఞ కరణంబైవ పంచాంగ మధిదేవతాః
పంచాంగ మనగ తిధి వారం నక్షత్రం యోగం కరణంబులను నైదంగంబులతో గూడినదని తెలియుచున్నది. అందలి తిధి మను బ్రహ్మచేతను – వారం మయబ్రహ్మచేతను – నక్షత్రం త్వష్ట బ్రహ్మచేతను – యోగం శిల్పిబ్రహ్మచేతను – కరణం విశ్వజ్ఞబ్రహ్మచేతను కల్పింపబడినై మఱియు వీరిలో మనుబ్రహ్మ అయోశిల్ప మనెడి కమ్నరమున కత్తికఱ్ఱు కుదురులు మొదలైన వాటిని జేసి ప్రజలకిచ్చిన శిల్పాచార్యుడు. మయబ్రహ్మ దారు శిల్పమనెడి వడ్రంగమున నాగలి ముల్లుగఱ్ఱ బండి యిల్లు మొదలైన వానిని నిర్మించిన యిచ్చిన శిల్పాచార్యుడు. త్వష్టబ్రహ్మ కాంశ్వతామ్ర శిల్పమనెడి లోహశిల్పమున వంటపాత్రలు, దేవతార్చనా పరికరములు మొదలైన వానిని రూపొందించి యిచ్చిన శిల్పాచార్యులు. శిల్పి బ్రహ్మ స్ధపతియై శిలా శిల్పమున దేవాలయములు, భవనములు మొదలైన వానిని వెలయించి యిచ్చిన శిల్పచార్యుడు. విశ్వజ్ఞబ్రహ్మ స్వర్ణశిల్పమున ఆభరణములు మాంగల్యముల చిత్రించి యిచ్చిన శిల్పచార్యుడు. ఈ స్వర్ణశిల్పశాలకే అర్కశాల యనియు పేరు. అర్కశాల కాలక్రమంబుగా అగసాలగ, కమసాలగా కూడా మారినది, అట్టి లోకకల్యాణ స్వరూపులైన మీ పంచబ్రహ్మలకు నేనిదే ప్రత్యేకాభివందనములు జేయుచున్నాను.
మను బ్రహ్మ స్వరూప శంకరదేవా ! సానగ ఋషి గోత్రం – అశ్వలాయన సూత్రం – సద్యోజాత ప్రవర – ఋక్శాభా – స్పటికవర్ణం – వెండిదండం – వెండిజందెం – త్రికోణ హోమకుండం – కాలమేఘవాహనం – ఋగ్వేద పారాయణుండఁవైన నీకిదే నా నమస్కారం .
మయబ్రహ్మ స్వరూప విష్ణుదేవా ! సనాతన ఋషి గోత్రం – ఆపస్ధంబ సూత్రం – వాసుదేవ ప్రవర – యజుశ్శాఖ – నీలవర్ణం – చతుష్కోణ హోమకుండం – వెదురు దండం పద్మజందెం – నీల మేఘవాహనం యజుర్వేద పారాయణుండవైన నీకిదే నా నమస్కారం.
త్వష్టబ్రహ్మ స్వరూప బ్రహ్మదేవా! అహభూన ఋషి గోత్రం – ద్రాహ్యాయన సూత్రం – అఘోర ప్రవర – శామశాఖ – తామ్రవర్ణం – వర్తృలాకార హోమకుండం – రావిదండం – రాగిజందెం – మహా నీల మేఘవాహనం – సామవేద పారాయణువైన నీకిదే నా నమస్కారం.
శిల్ప బ్రహ్మ స్వరూప యింద్రదేవా ! ప్రత్ననఋషి గోత్రం –ఆప్యాయన సూత్రం – తత్పురుష ప్రవర – ఆధర్వణ శాఖ – ధూమ్రవర్ణం – పంచకోణ హోమకుండం – బెత్తపుదండం – నూలుజందెం – కుంభమేఘ వాహనం – ఆధర్వణవేద పారాయణుండవైన నీకిదే నా నమస్కారం.
విశ్వజ్ఞబ్రహ్మ స్వరూప సూర్యదేవా! సువర్ణఋషి గోత్రం – కాత్యాయనీ సూత్రం – ఈశాన ప్రవర – ప్రణవశాఖ – హేమవర్ణం – అష్టకోణ హోమకుండం – బంగారుదండం – బంగారు జందెం – వాయల మేఘ వాహనం – ప్రణవవేద పారాయణుండవైన నీకిదే నా నమస్కారం.

No comments: