విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Wednesday, October 8, 2014

రుంజాభివృద్ది ఆకాంక్ష


రుంజాభివృద్ది ఆకాంక్ష

శుభోదయం



ముఖపుస్తక విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ శ్రేయోభిలాషులకు, కులాభివృద్ది జిజ్ఞాస ఉన్నవారికి నా హృదయపూర్వక నమఃస్సుమాంజలి

విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మల యొక్క ఆశ్రిత కులాలో మొదటిదైనటువంటి మన రుంజ. పూర్వకాలం నుండి అనాదిగా విశ్వకర్మల యొక్క విశిష్టతని ఉరూరా తెలియపరచు మాద్యమముగా వ్యవహరించు ఉపకరణ వాయిద్యము రుంజ, అలాంటి రుంజా వాయిద్యము నేడు కనుమరుగైనటువంటి పరిస్ధితి దాపురించినది కావున రుంజ మరళా పూర్వవైభము నకు రావలెనంటే మనము కొంతైన రుంజ/రుంజాకారులను ఆదుకొను మరియు అభివృద్ది పరచు ఆలోచనలు చేయవలెనని నా ఆలోచన/భావన

1.       పూర్వపుకాలం లాగానే సంవత్సరము నకు ఒక్క సారి, కనీసం ఒక్క రోజు వారి ఆగమన సమయము నందు ప్రతీ విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ ఇండ్లలో వారికి ఘనఆతీద్యము ఇవ్వవలెను లేదా ఆ నగరి/ఉరిలో విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంక్షేమ సంఘాలు వారిని తగినరీతిలో సత్కరించవలెను.

2.     విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మలు తమ శుభకార్యముల సమయమందు  వారిని ఆహ్వనించి రుంజావాయిద్యము మరియు  విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ ల యొక్క ఔనత్యము గూర్చి వారికి తెలిసిన విషయములను వారు భహిర్గతము చేయునట్లు వారిని ప్రోత్సహించవలేను.

3.      అలాగే మనము ప్రతీ చోట ఏదో విదమైనటువంటి సభలు సమావేశాలు జరుపుకుంటుంన్నాము ఆ కార్యక్రమమునకు వారిని విదిగా పిలిచి ప్రార్ధనా గీతములను ఆలపించు విధి విదానములను తప్పనిసరి చేయవలను.

4.     ముఖ్యసుచన:- రుంజాకళాకారులను నడిపించువారు తమ తమ ప్రాంతాలలో ఉన్నటువంటి నవ యువకులకు ఈ కళయొక్క ప్రాధాన్యత ని తెలిపి ఇది యాచక వృత్తికాదు ఇది మాద్యమము (గోప్య సమాచార రధము) గా అభివర్ణించాలి. వారికి ఈ యొక్క కళను గురుముఖము గా నేర్పించుటకు ప్రయత్నించాలి,

ఇక్కడొక విషయం గమనించ ప్రార్ధన ఈ కళను నేర్వడానికి ముందుకొచ్చిన విద్యార్దులకు వారి చదువు ఉద్యొగాలకు ఎటువంటి ఆటంకము ఏర్పచకుండా చూడవలెను, ఇదికేవలం రుంజా పుర్వవైభవము ని సంతరింటుకొనుటకు మరియు సమాచార సేకరణకు మాత్రమే నని గమనించ ప్రార్ధన

తప్పులుంటే క్షమించి మరియూ సరిదిద్దవలయును

మీ సుచనలు సలహాలు మన అభివృద్దికి దోహదకారకాలని మరువకండి

ఇట్లు
మీ

లోపింటిశ్రీ