విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Tuesday, May 27, 2008

రాష్త్ర విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్నికలు రసాభస

తేది:26-05-2007

ఓట్ల గల్లంతు పై రగడ

రాష్త్ర విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్నికలు రసాభస

విజయవాడ సిటీ, న్యూస్ టుడె : ఓట్ల గల్లంతుపై ఎర్పడిన వివాదం ప్రాంతీయ విభేదాలకు దారి తీసి రాష్త్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నికలు రసాభసగా మారాయి ఆదివారం విజయవాడలొని వన్ టౌన్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో జరిగిన ఈ ఎన్నికలు ప్రారంభం నుంచే అభ్యర్దుల మధ్య ప్రాంతీయ విభేదాలు పొడచూపాయి. ఇరువర్గాలవారు ఆంధ్రా, తెలంగాణా డౌన్ డౌన్ అంటు ఘర్షణకు దిగటంతొ పొలీసులు రంగప్రవేశం చేశారు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు ముగ్గురుచొప్పున బరిలో ఉన్న అభ్యర్దులు ఎవరికి వారు తమ ఓటర్లను ప్రత్యేక బస్సులలో రప్పించారు. తెలంగాణా ఓటర్లు తమ ఓట్లు గల్లంతయ్యాయని అభ్యంతరాలు లేవనెత్తటంతో ఏసీపీ విజయకుమార్ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేసి పోలింగ్ బూత్ లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నినాదాలుచేస్తున్న ఓటర్లను పొలీసులు చెదరగొట్టారు. ఒక దశలో స్వల్పలాఠీ ఛార్జి చేశారు. 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల వారు ఎన్నికలను బహిష్కరించి వెళ్లిపోగా తిరిగి 4 గంటలతర్వాత పోలింగ్ నిర్వహించారు. సభ్యత్వం ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం సమయానికి వచ్చిన సభ్యులనే ఓటు వేసేందుకు అనుమతించామని ఓట్ల గల్లంతు ఆరోపణల పై ఎన్నికల అధికారి వివరణ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటాచారి అధ్యక్షునిగా, విశాఖపట్నానికి చెందిన గోడి నరసింహాచారి ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారన్నారు.

Courtesy by eenaadu daily