విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం
విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం
Thursday, March 26, 2009
తెలుగు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
విరోధినామ సంవత్సరానికి స్వగతం
చైత్ర శుద్ద పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకొంటాము.
యుగ+ఆది=ఉగాది
తెలుగు వారే కాక కన్నడ ప్రజలు కూడా ఈ పండుగ ఈ రోజె జరుపుకుంటారు సుమీ.
కన్నడ లో ఉగాదిని బెవుబెల్ల అని అంటారండి
మన ఉగాది పచ్చడి అన్ని రుచుల సమ్మేళనం అని అందరికి తెలుసనుకోండి
మన జీవితం కూడా అంతే, వచ్చే ఒడిదుడుకు లను తట్టుకోవాలిమరి
అన్నిటిని సమానంగా తీసుకోవాలండి
ఈ పండగ ప్రతేకతగా పంచాంగ శ్రవణం ఉదయాన్నే మొదలవుతుందండీ
ముందు జాగర్తగా సంవత్సరలో ఉండే ఒడిదుడుకులను అర్ధం చేసుకొని మసలడానికి వీలుగా సుమీ
ఇదిగో ఉగాది పచ్చడి తయార్
మహారాష్ర్టలో ఉగాదిని గుధిపాడ్వా ఆంటారని వినికిడి
కవి సమ్మేళనం
కవి సమ్మేళనం ఆంటె జ్ఞాపకం వచ్చింది అష్ఠావధానం/ శతావధానం ఏంత బాగుంటుందండి
ఇది మన తెలుగు వారి ప్రత్యేకత సుమీ, ఇది మన తెలుగు వారి కీర్తి కీరీఠం.
మరి యొక్క సారి తెలుగు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
Sunday, March 1, 2009
విశ్వకర్మా ! నీకు జోహార్లు!
1. నిర్మలంబగు నీరు ద్రాగవలెనన్న
ద్రవపాత్ర నిర్మించు ద్రష్టాధీశుడు విశ్వకర్మ కదా !
2. సుఖ నిద్ర సమున్నతముగ పొందవలెనన్న
పట్టె మంచం గావించు ప్రాజ్ఞుడు విశ్వకర్మ కదా!
3. గృహములు నిర్మించి నివసించవలెనన్న
గృహ ద్వారబందాలు నిర్మించు ఘనుడు విశ్వకర్మ కదా!
4. పడతితో పురుషుడు పరిణ మాడవలెనన్న
పడతికి మాంగళ్య సూత్రం చేయు విశ్వజ్ఞుడు విశ్వకర్మ కదా!
5. దేవాలయం నందు దేవుని ప్రార్ధించవలెనన్న
దేవతా ప్రతిమను చేయు శిల్పజ్ఞుడు విశ్వకర్మ కదా!
6. పొలములో హలముతో దుక్కి దున్నవలెనన్న
ఆ హలము చేయు సూత్రధారుడు విశ్వకర్మ కదా!
7. ఆధునిక యుగంలో యంత్రప్రగతి సాధించవలెనన్న
యంత్రపరికరములు చేయు ప్రాజ్ఞుడు విశ్వకర్మ కదా!
8. పంచలోహములతో వివిధాకృతులు చేయవలెనన్న
సుందర రూపములు చేయు స్కంభనేభుడు విశ్వకర్మ కదా!
9. తల్లి గర్బం నుండి వచ్చు బిడ్డకు బొడ్డు కోయవలెనన్న
పదునైన కత్తిని చేయు త్వష్టాధీశుడు విశ్వకర్మ కదా!
10. విద్యల నేర్చు సమయాన హస్తాలతో వ్రాయవలెనన్న
హస్త లాఘవం గల ఘంటంబు చేయు ఘటికుడు విశ్వకర్మ కదా!
11. మరణానంతరం మనిషిని మట్టిలో మట్టు పెట్టవలెనన్న
మట్టిని త్రవ్వుటకు పలుగు-పారలు, చేయు మాన్యుడు విశ్వకర్మ కదా!
12. విశ్వ విఖ్యాతి చెందిన వేమన శతకములో
విశ్వకర్మ లేని విశ్వంబు లేదురా, విశ్వదాభిరామ వినుర వేమ లో
అభిరాముడు విశ్వకర్మ కదా!
అందులకే – ఓ విశ్వకర్మా! నీకు జోహార్లు.
రచన
సామోజు భోగలింగాచారి,
విశాఖపట్నం