విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Thursday, July 22, 2010

శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహారాజు సన్నిధిలో గురు పౌర్ణమి పర్వదిన మహొత్సవము

శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహారాజు సన్నిధిలో గురు పౌర్ణమి పర్వదిన మహొత్సవము

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహు గురు దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః



మనిషికి జన్మనిచ్చేది తల్లిదండ్రులయితే మనిషి జీవతానికి ఒక దశ, దిశను, నిర్ధేశించి ముందుకు నడిపించే వారే గురువు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల, త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తగురువు జగద్గురువై శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మండనాయిక రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహారాజు రాజగురవై మనలందరిని అనుగ్రహించుట కొరకు MVP Colony, సెక్టరు – 4, Visakhapatnam లో గల శ్రీషిరిడి సాయినాధుడుగా వెలసియున్నాడు. స్వామి సన్నిధిలో గురుపూజా మహొత్సవం తేది 25-07-2010 (ఆదివారం) అత్యంత వైభవముగా జరుగుచున్నది .

సేవలు:

1. ఉదయం గం . 5.15ని లకు కాకడ హారతి


2. ఉదయం గం . 5.50ని లకు 108 పాలకలశాలతో ఉరేగింపు అనంతరం క్షీరాభిషేకం మరియు పంచామృతాభిషేకం ప్రతేక పూజలు


3. ఉదయం గం . 9.00ని లనుంచి అన్నాభిషేకం


4. మధ్యాహ్నం గం . 12.30ని ల నుండి అన్నదానం


5. సాయంత్రం గం . 05.00ని లకు స్వామివారి తిరువీధి (పల్లకీ సేవ)


6. సాయంత్రం గం . 06.15ని లకు హారతి మరియు భజన


7. రాత్రి గం . 8.00ని లకు హారతి మరియు పవళింపు సేవ జరుగును.


పై కార్యక్రమాలలో భక్తులు పాల్గొని శ్రీ సాయినాధుని తీర్ధ ప్రసాదములను స్వీకరించి గురు కరుణా కటాక్షములను పొందగలరు.

కార్యక్రమ నిర్వాహకులు: శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘీక సంక్షేమ సంఘం