విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Tuesday, February 12, 2013

పురుష సూక్తం ధారావాహిక:-4

పురుష సూక్తం ధారావాహిక:-4

తేన’ దేవా అయ’జంత | సాధ్యా ఋష’యశ్చ యే ||
తస్మా”ద్యఙ్ఞాత్-స’ర్వహుతః’ | సంభృ’తం పృషదాజ్యమ్ |
పశూగ్-స్తాగ్శ్చ’క్రే వాయవ్యాన్’ | ఆరణ్యాన్-గ్రామ్యాశ్చ యే ||
తస్మా”ద్యఙ్ఞాత్స’ర్వహుతః’ | ఋచః సామా’ని జఙ్ఞిరే |
ఛందాగ్మ్’సి జఙ్ఞిరే తస్మా”త్ | యజుస్తస్మా’దజాయత ||
భావము:- అట్లు దేవతలు, సాధ్యులు, ఋషులు కలసి చేసిన యజ్ఞరూప యజ్ఞ పురుషుని యొక్క మానస యజ్ఞము నుండి వృషత్ అనే నేయి ఉత్పన్నం అయినది (సంపాదింప బడెను). వాయు దేవతాకములగు పశువులును, అరణ్యములో, గ్రామములో నుండు జంతువులు (లేడి, దుప్పెలు, ఆవులు, కోళ్ళు, పక్షులు వగైరా") మున్నగునవియు, ఋక్కులు, సామములు (వేదములు), గాయత్రీ మున్నగు ఛందస్సులు మరియు యజస్సులు (యజుర్వేదం) ఉద్భవించినవి (పుట్టినవి).
(తదుపరి ధారావాహిక:-5 లో ఇంకా ఉంది).
గమనిక:- తమరందరకు ఇది నా "మనవి":- ఇక్కడ ఇచ్చిన చిత్రాలు(ఫోటోలు) కేవలం అర్ధం అవుటకు ఇచ్చినవి మాత్రమే, యేమనిన పరమాత్మ నిరాకారుడు. సాకారం అనుకున్నా కాని ఆ స్వరూపం వర్ణించటం మానవ మాత్రులకు అసాధ్యం, ఆ స్వరూపం వర్ణనాతీతం.. జ్ఞానులైన తమరందరూ దయ చేసి అర్ధం చేసుకుంటారని ప్రార్దన.
(ఆచార్యవిశ్వబ్రహ్మ/NGR)

Sunday, February 10, 2013

పురుష సూక్తం ధారావాహిక:-3

పురుష సూక్తం ధారావాహిక:-3

యత్పురు’షేణ హవిషా” | దేవా యఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||
సప్తాస్యా’సన్-పరిధయః’ | త్రిః సప్త సమిధః’ కృతాః |
దేవా యద్యఙ్ఞం త’న్వానాః | అబ’ధ్నన్-పురు’షం పశుమ్ ||
తం యఙ్ఞం బర్హిషి ప్రౌక్షన్’ | పురు’షం జాతమ’గ్రతః |

భావము:- దేవతలు ఒక మానస యజ్ఞము చేసితిరి! ఆ విరాట్ పురుషునే హవిస్సులు గా భావించి, అందుకు వసంత ఋతువు నేయి గా, గ్రీష్మము సమిధి గా, శరదృతువు హవిస్సు గా అయినవి (భావించిరి), ఆ యజ్ఞమునకు గాయత్రి మున్నగు ఛందస్సులు ఏడు మేరలుగాను ఆ ఏడింటి తోనే ఏర్పడిన ఇరువది వొక్కింటిని సమిధలు గా భావించిరి! వారు ఆ పురుష పశువును స్థూపమునకు కట్టి విశనము చేసిరి.
(వివరణ:- ప్ర ప్రథమంగా ఆ విరాట్ పురుషుడు నుంచి ఉద్భవించిన (సృష్టించిన) దేవతలు పంచ ఋషులు సానగ లేక మను (శివుడు) సనాతన లేక మయ (విష్ణు) ఆహాభున లేక త్వష్ట (ఇతనినే పురాణములో చతుర్ముఖ బ్రహ్మ గా వర్ణించినారు) ప్రత్న లేక దైవజ్ఞ లేక శిల్పి (ఇంద్రుడు) సుపర్ణ లేక విశ్వజ్ఞ (సూర్యుడు), ఈ పంచ ఋషులు సృష్టిని పాలన (నడుపుటకై) చేయు సామర్ధ్యం కొరకు ఒక మానస యజ్ఞము చేయదలచిరి! ఆ యజ్ఞమునకు హవిస్సులు లేనందున ఆ విరాట్ పురుష స్వరూపము నే హవిస్సు గా భావించి, అందుకు వసంత ఋతువు నేయి గా, గ్రీష్మము సమిధి గా, శరదృతువు హవిస్సు గా భావన చేసిరి, ఆ యజ్ఞమునకు గాయత్రి మున్నగు ఛందస్సులు ఏడు మేరలుగాను ఆ ఏడింటి తోనే ఏర్పడిన ఇరువది వొక్కింటిని సమిధలు గా భావించిరి! వారు ఆ పురుష పశువును స్థూపమునకు కట్టి విశనము చేసిరి). (తదుపరి ధారావాహిక:-4 లో ఇంకా ఉంది).
గమనిక:- తమరందరకు ఇది నా "మనవి":- ఇక్కడ ఇచ్చిన చిత్రాలు(ఫోటోలు) కేవలం అర్ధం అవుటకు ఇచ్చినవి మాత్రమే, యేమనిన పరమాత్మ నిరాకారుడు. సాకారం అనుకున్నా కాని ఆ స్వరూపం వర్ణించటం మానవ మాత్రులకు అసాధ్యం, ఆ స్వరూపం వర్ణనాతీతం.. జ్ఞానులైన తమరందరూ దయ చేసి అర్ధం చేసుకుంటారని ప్రార్దన.

(ఆచార్యవిశ్వబ్రహ్మ/NGR)