విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం
విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం
Saturday, April 13, 2013
Wednesday, April 10, 2013
Sunday, April 7, 2013
హిందు ధర్మం అంటే ఏమిటి?
హిందు ధర్మం అంటే ఏమిటి? నేను హిందువుని ఎందుకు అయ్యాను?
మిగిలిన మతాలవలే కాకుండా, హిందు ధర్మం స్వర్గం/నరకం అనే మూఢ విశ్వాసం మీద
ఆధారపడిలేదు. కొన్ని మూఢవిశ్వాసాలను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరిని
గుడ్డిగా నమ్మమని చెప్పేది కాదు హిందు ధర్మం ! హిందు ధర్మం దేనిని గుడ్డిగా
నమ్మమని చెప్పదు, దేనిలో అయినా సత్యాన్ని పరిశోధించి తెలుసుకోమని
బోధిస్తుంది. ఈ ప్రపంచంతరువాత స్వర్గం/నరకం అనేవి లేవు. కేవలం మన కర్మలే
జీవితాన్ని స్వర్గం/నరకం అయ్యేలా చేస్తాయి.
హిందువు యొక్క ధర్మం ఏమిటంటే ప్రకృతిని, చుట్టూ ఉండే తోటి ప్రాణులను
కాపాడడం !ఈ ప్రపంచంలో చెడు అనేది ఏమి లేదు, అంతా దైవత్వమే ! మన శరీరంలానే ఈ
విశ్వం కూడా పంచభూతాలతో సృష్టింపబడినది. అంటే మన శరీరం కూడా చిన్న
విశ్వంలాంటిదే! మన లోపల ఎలాగైతే తెలివి, జ్ఞానం, ఆత్మ ఉంటాయో అలానే ఈ
విశ్వం లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు !
దేవుడు అనేవాడు ఒక
వ్యక్తి/జీవం కాదు. దేవుడు అంటే పవిత్రమైన, అనంతమైన శక్తి.
శివుదు(పరమాత్మ), గౌరీ మాత( శక్తి) కలయిక వలనే ఈ విశ్వం సృష్టిపబడుతూ
ఉంటుంది. పరమాత్మను తెలుసుకుని మన ఆత్మను ఐక్యం చేయడమే ఆత్మ సాక్షాత్కారం !
అదే మన జీవిత గమ్యం మరియు ఇదే సులభమైన/ఉత్తమమైన మార్గం !
హిందు
ధర్మం లొ శాస్త్రీయత/విజ్ఞానం ఉంది ! హిందు ధర్మం ద్వారా మీకు సత్యం
తెలుసుకోవాలని లేకపోతే ఇతరులను బాధపెట్టకుండా మీకు ఇష్టం వచ్చినట్టు
జీవించవచ్చు. దానినే ధర్మం అంటారు.
మతం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఎందుకంటే అది మూఢ విశ్వాసలపై ఆధారపడి ఉంటుంది.
ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది ఎందుకంటే అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది.
హిందు ధర్మం లోకి అందరికి స్వాగతం: సత్యాన్ని పరమాత్మను తెలుసుకోండి !
------------------------------ --
"లోక సమస్త సుఖినో భవంతు !"
Wednesday, April 3, 2013
Subscribe to:
Posts (Atom)