స్వాతంత్ర్య సమరయోధులు, మనతెలుగువారు. భారతదేశ జాతీయ పతాక రూపకర్త 1916 సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. మన జాతికొక పతాకం కావాలని, అదీ ఒక ఆంధ్రుని ద్వారా నెరవేరడం, ఆంధ్రులందరికీ గర్వకారణమైన విషయం
శ్రీమధ్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయక, సర్వమత సమతావాది, భూతభవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన ప్రచారకుడు, కలియుగ వైతాళికుజడు, శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి 316 వ నిర్వికల్ప జీవసమాధి మహొత్సవం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆంతాటా జరుపుకోంటున్నారు.
విరోధినామ సంవత్సరానికి స్వగతం చైత్ర శుద్ద పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకొంటాము. యుగ+ఆది=ఉగాది తెలుగు వారే కాక కన్నడ ప్రజలు కూడా ఈ పండుగ ఈ రోజె జరుపుకుంటారు సుమీ. కన్నడ లో ఉగాదిని బెవుబెల్ల అని అంటారండి మన ఉగాది పచ్చడి అన్ని రుచుల సమ్మేళనం అని అందరికి తెలుసనుకోండి మన జీవితం కూడా అంతే, వచ్చే ఒడిదుడుకు లను తట్టుకోవాలిమరి అన్నిటిని సమానంగా తీసుకోవాలండి ఈ పండగ ప్రతేకతగా పంచాంగ శ్రవణం ఉదయాన్నే మొదలవుతుందండీ ముందు జాగర్తగా సంవత్సరలో ఉండే ఒడిదుడుకులను అర్ధం చేసుకొని మసలడానికి వీలుగా సుమీ ఇదిగో ఉగాది పచ్చడి తయార్
మహారాష్ర్టలో ఉగాదిని గుధిపాడ్వా ఆంటారని వినికిడి కవి సమ్మేళనం కవి సమ్మేళనం ఆంటె జ్ఞాపకం వచ్చింది అష్ఠావధానం/ శతావధానం ఏంత బాగుంటుందండి ఇది మన తెలుగు వారి ప్రత్యేకత సుమీ, ఇది మన తెలుగు వారి కీర్తి కీరీఠం. మరి యొక్క సారి తెలుగు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
అంతటి కృష్ణుడు అందగాయుందియూ పాండవులు పడరాని కష్టాలు పడ్డారయా రాజది రాజులై భిక్షమెత్తారు దైవలీలలు కనగ ఎవ్వరికీ తరమౌను ...
నన్ను తలచిన యెడల నా దర్సనంబిత్తు సత్యమ్బు నా మాట నమ్మందయా మాయ శక్తులు చేయు ప్రళయంబులెన్నైన మ్మిమంటబోవని తెలియండయా ...
నన్ను తలచిన వారు నామయ యటంచు ఐశ్వర్యవంతులుగా నుండేరయా ఎట్టి ఆపదలైనా ఎన్ని కష్టములైన నేనుండి తొలగింతు నమ్మండయా ... ఇంకా వుంది మనిషికి తెలియని మర్మమేది లేదు తానెవరో మాత్రము తెలియలేదు బయటి విషయముల తెలియు తననుండి తెలియదు తన్ను తానేరుగుతకు తీరికేయుండదు. ...
సూర్యుని తేజస్సు క్రమముగా తగ్గెను జీవరాశులు ఎన్నో నశియించి పోయెను శాస్త్రవేత్తలకడి గోచరము కాకుండా దైవమే గతియని ప్రార్ధనలు చేసేరు....
బాహ్య విషయములకై పరుగెత్తినావంటే ఏడ్పించి నీ పై స్వారీ జేసెను పరమాత్మ వైపున మనస్సు నిలిపావంటే ప్రకృతే నీ పాద సేవ జేసెను...
మంచితనమునకు మించు శక్తేది బలమేది ఉజ్వల మైనట్టి సుగుణంబురా మంచి వాని మంచి సుఖ సౌఖ్యములనిచ్చు చెడు సర్వనాశనం జేసేనురా ...
భ్రమలు తిప్పగా లేక బానిసగా బ్రతికేరు సత్యంబు అన్నది తెలియండయా మానవ జన్మము దొరికేది దుర్లభము దేవతలు దీనికి వగచేరయా...
ఈ లోకమందున పుట్టినందుకు నీవు గుర్తునకు ఏదైనా మంచి జేసి వెళ్ళు లేకున్న క్రిములకూ నీకు తేడా యేమి ఇంకెంత కాలంబు బ్రతికేవురా!
నీ తల్లి పార్వతీ నీ తండ్రి శంకరుడు ఆలి మాయ శక్తి అంశంబురా నీ కన్నబిడ్డలే గణపతాంశము తెలియ అట్టి వారి మెప్పు పొందాలిరా!
బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతక నేర్చేరూ.
చెప్పలేదంటనక పొయ్యేరు తప్పదిదిగో గురుని వాక్యము తప్పు ద్రోవల బోవు వారల చప్పరించి మ్రింగు శక్తులు ముప్పెతనమున మోసపొయ్యేరు అదిగాక కొందరు గొప్పతనమున గోసుమీరేరు.
ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేలనో మరి గుప్పు గుప్పున దాటి పోయేడు గుర్రపడుగులు ఏరుపడును తాకుతప్పులు తలచకున్నారు - తార్కాణమైతే తక్కువెక్కువ తెలియనేర్తూరు
జోక తోడుత తల్లి పిల్లలు జోడు బాసి అడవులందు కాకి శోకము చేసి ప్రజలు కాయ కసురులు నమిలి చత్తురు కేక వేసియు ప్రాణమిడిచేరు - రాకాసి మూకలు కాక బట్టి కలవరించేరు
ఆకసమ్మది ఎర్ర బారును ఆరు మతములు ఒక్కటౌను లోకమందలి జనములందరు నీరునిప్పున మునిగి పోదురు అగలు విడిచి పొగలు దాటేరు-అది గాక పట్ట పగలు చుక్కలు చూసి భ్రమసేరు
భుగులు భుగులు ధ్వనులు మింటున పుట్టియేగిన పిమ్మటాను దిగులు పడుచూ ప్రజలు చాలా దిక్కులేని పక్షులౌదురు పాతకూతా పదట గలిసేరు -పరిపూత చరితులు సాధువులు సంతసింతురు
భూమి మీదను ధూముధాములు పుట్టిపెరిగిన పిమ్మటానూ రామ రామ యనని వారలు రాలిపోదురు కాలి పోదురు ముందు వెనకలు గాన కున్నారు - మూర్ఖావలీ భువిలో ముందు గతినే యెరగ కున్నారు