విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Friday, December 31, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు





ధన్యవాదములు

Wednesday, September 15, 2010

శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మజయంతి శుభాకాంక్షలు


శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మజయంతి శుభాకాంక్షలు

శ్లో|| నభూమి నజలం చైవనతేజో నచ వాయవః
      నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః
      సర్వశూన్య నిరాలంబం స్వయంభూ విశ్వకర్మణః
తా|| భూమి  జలము  అగ్ని  వాయువు ఆకాశము 
      బ్రహ్మ  విష్ణు మహేశ్వర   ఇంద్ర  సూర్య నక్షత్రంబులు లేనివేళ విశ్వకర్మ
      స్వయంభూ రూపమై యుండెను 



Thursday, July 22, 2010

శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహారాజు సన్నిధిలో గురు పౌర్ణమి పర్వదిన మహొత్సవము

శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహారాజు సన్నిధిలో గురు పౌర్ణమి పర్వదిన మహొత్సవము

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహు గురు దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః



మనిషికి జన్మనిచ్చేది తల్లిదండ్రులయితే మనిషి జీవతానికి ఒక దశ, దిశను, నిర్ధేశించి ముందుకు నడిపించే వారే గురువు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల, త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తగురువు జగద్గురువై శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మండనాయిక రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహారాజు రాజగురవై మనలందరిని అనుగ్రహించుట కొరకు MVP Colony, సెక్టరు – 4, Visakhapatnam లో గల శ్రీషిరిడి సాయినాధుడుగా వెలసియున్నాడు. స్వామి సన్నిధిలో గురుపూజా మహొత్సవం తేది 25-07-2010 (ఆదివారం) అత్యంత వైభవముగా జరుగుచున్నది .

సేవలు:

1. ఉదయం గం . 5.15ని లకు కాకడ హారతి


2. ఉదయం గం . 5.50ని లకు 108 పాలకలశాలతో ఉరేగింపు అనంతరం క్షీరాభిషేకం మరియు పంచామృతాభిషేకం ప్రతేక పూజలు


3. ఉదయం గం . 9.00ని లనుంచి అన్నాభిషేకం


4. మధ్యాహ్నం గం . 12.30ని ల నుండి అన్నదానం


5. సాయంత్రం గం . 05.00ని లకు స్వామివారి తిరువీధి (పల్లకీ సేవ)


6. సాయంత్రం గం . 06.15ని లకు హారతి మరియు భజన


7. రాత్రి గం . 8.00ని లకు హారతి మరియు పవళింపు సేవ జరుగును.


పై కార్యక్రమాలలో భక్తులు పాల్గొని శ్రీ సాయినాధుని తీర్ధ ప్రసాదములను స్వీకరించి గురు కరుణా కటాక్షములను పొందగలరు.

కార్యక్రమ నిర్వాహకులు: శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘీక సంక్షేమ సంఘం

Monday, May 24, 2010

వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 317వ అఖండ దీపారాధన


ఓం, హ్రీం, క్లీం, శ్రీం, శివాయ బ్రాహ్మణేనమః
జగద్గురు శ్రీమధ్ అఖిలాండకోటి బ్రహ్నాండ నాయడుకు సర్వమత సమతావాది భూత, భవిష్యత్ వర్తమాన కాలజ్ఞన ప్రచారకుడి కలియుగ దైవం శ్రీమధ్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నేడు నిర్వి కల్ప జీవసమాధి అయిన సందర్బము గా  తేదిః 23-05-2010 ఆదివారం ఉదయం 6 గంటలకు మహా కుంభాభిషేకం,  పంచామృతాభిషేకము మరియు మధ్యాహ్నాం 12 గంటలకు 317వ అఖండ దీపారాధన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం (MVP colony, Visakhapatnam) లో జరిగినది
Photobucket
Photobucket

Tuesday, March 16, 2010

తెలుగు నూతన సంవత్సర (ఉగాది) శుభాకాంక్షలు

Get Flash javascript:void(0)Player

తెలుగు వారికి

మరియు విశ్వబ్రాహ్మణులకు

నూతన సంవత్సరం

శ్రీ వికృతినామ సంవత్సరం 2010

శుభాకాంక్షలు

Wednesday, February 10, 2010

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ మాతా గోవిందమాంబల కళ్యాణ మహోత్సం


శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ మాతా గోవిందమాంబల కళ్యాణ మహోత్సం
స్వస్తిశ్రీ చాంద్రమా శ్రీ విరోది నామ సంవత్సరం మాఘ బహుళ చతుర్ధశి తేది 12-02-2010 శుక్రవారం ఉత్తరాషాడ నక్షత్రయుక్త మేషలగ్మమందు  శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ మాతా గోవిందమాంబల కళ్యాణం అన్ని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కోవెలలో జరుపబడుచున్నది అలాగే శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయము, సెక్టార్ - 4, యం.వి.పి.కోలని, విశాఖపట్నం - 530 017. లో గల      శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ మాతా గోవిందమాంబల కళ్యాణ మహోత్సం అత్యంత వైభవంగా జరుపబడుచున్నది. 
మహా అన్నదానం  శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ మాతా గోవిందమాంబల కళ్యాణ మహోత్సం పురస్కరించుకొని మరియు మహా శివరాత్రి సందర్భముగా మధ్యాహ్నం 12.30 గంటల నుండి మహా అన్నదానం జరుగును  అదే రోజు సాంయంత్రం 5 గంటలకు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ మాతా గోవిందమాంబల ఉత్సవమూర్తుల పల్లకి సేవా(ఊరేగింపు) జరుగును.

Friday, January 1, 2010





తెలుగు బ్లాగర్లకు, మరియు విశ్వబ్రాహ్మణులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు