విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Friday, January 25, 2013

పురుష సూక్తం ధారావాహిక:-2


పురుష సూక్తం ధారావాహిక:-2
పాదో”உస్య విశ్వా’ భూతాని’ | త్రిపాద’స్యామృతం’ దివి ||
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురు’షః | పాదో”உస్యేహాஉஉభ’వాత్పునః’ |
తతో విష్వణ్-వ్య’క్రామత్ | సాశనానశనే అభి ||
తస్మా”ద్విరాడ’జాయత | విరాజో అధి పూరు’షః |
స జాతో అత్య’రిచ్యత | పశ్చాద్-భూమిమథో’ పురః ||
విరాట్ పురుషుడు (విశ్వం) ఆ పరమాత్ముని యొక్క నాల్గవ భాగం మాత్రమే, ఆ శక్తి యొక్క మిగిలిన మూడు భాగములు స్వయం ప్రకాశ రూపము నందు నాశ రహితమై ఉన్నది, మరియు జనన మరణ గుణ రహితమై ఉన్నది. కేవలం ఆ నాల్గవ భాగము మాత్రమే మాయ ను పొంది సృష్టి, పాలనా, సంహార, కార్యములను చేయుచున్నది, సర్వత్ర వ్యాపించు చున్నది, మయా సంబంధము కలిగిన తరువాత దేవ మర్త్య తిర్యక్ లు మున్నగు చేతనా చేనముల (ఆత్మ) యందు వ్యాపించి ఉన్నది, ఆ పరమశక్తి తన నుంచే తను తనంతట తానుగా విరాట్ పురుషుడు గా ప్రభవించి భూమిని సృష్టించెను, పిమ్మట దేవ, మనుష్య, తిర్యక్కులు మొదలగు వాని సప్త ధాతువుల దేహములను సృష్టించెను. అందలి సకల దేహములందు ఆత్మ రూపముగా వ్యాపించి ఉన్నాడు. (తదుపరి ధారావాహిక:-3 లో ఇంకా ఉంది).
గమనిక:- తమరందరకు ఇది నా "మనవి":- ఇక్కడ ఇచ్చిన ఫోటోలు కేవలం అర్ధం అవుటకు ఇచ్చినవి మాత్రమే, యేమనిన పరమాత్మ నిరాకారుడు. సాకారం అనుకున్నా కాని ఆ స్వరూపం వర్ణించటం మానవ మాత్రులకు అసాధ్యం, ఆ స్వరూపం వర్ణనాతీతం. జ్ఞానులైన తమరందరూ దయ చేసి అర్ధం చేసుకుంటారని ప్రార్దన.
(ఆచార్యవిశ్వబ్రహ్మ/NGR)

No comments: