పురుష సూక్తం ధారావాహిక:-6
వేదాహమే’తం పురు’షం మహాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సస్తు పారే |
సర్వా’ణి రూపాణి’ విచిత్య ధీరః’ | నామా’ని కృత్వాஉభివదన్, యదాஉஉస్తే” ||1-16
ధీరుడై క్రియా శీలుడై, సమస్త రూపములను సృష్టించి, వానికి నామకరణం కావించి (పేర్లు పెట్టి) అంతటను వ్యాపించి ఉండి పాలిస్తున్న, సూర్యుని యొక్క ప్రకాశము కుడా అతనే అయి ఉన్నాడని నేను తెలుసు కొనుచున్నాను, అతను అజ్ఞానము అనే అందకారమునకు ఆవల ఉన్నాడు.
ధాతా పురస్తాద్యము’దాజహార’ | శక్రః ప్రవిద్వాన్-ప్రదిశశ్చత’స్రః |
తమేవం విద్వానమృత’ ఇహ భ’వతి | నాన్యః పంథా అయ’నాయ విద్యతే ||1-17
ధాత అయిన త్వష్ట బ్రహ్మ(పురాణములో చతుర్ముఖ బ్రహ్మగా వర్ణించిన) చే చెప్పబడిన వాడును, ఇంద్రుని చే నెరుగబడి నలుదిక్కుల ప్రసిద్దినొంది ఉన్నవాడగు విరాట్ పురుషుని ఈ ప్రకారముగా తెలుసు కొనిన, ఈ జన్మ నుంచే అమ్రుతులు కాగలరు, వేరే మార్గము వెతకనవసరము లేదు
యఙ్ఞేన’ యఙ్ఞమ’యజంత దేవాః | తాని ధర్మా’ణి ప్రథమాన్యా’సన్ |
తే హ నాకం’ మహిమానః’ సచంతే | యత్ర పూర్వే’ సాధ్యాస్సంతి’ దేవాః ||1-18
దేవతలు తమ మానస యజ్ఞము చే యజ్ఞ రూపుడగు ఆ విరాట్ పురుషుని ఉద్భవింపజేసిరి, అతని ధర్మములే ముఖ్యము లాయెను, ఆ విరాట్ పురుషుని గూర్చి జ్ఞాన మొందిన మహానుభావులు పూర్వపు సాధ్యులు ఉండునట్టి స్వర్గమును ఈ భులోకమునే పొందెదరు.
ద్వితీయానువాకము
అద్భ్యః సంభూ’తః పృథివ్యై రసా”చ్చ | విశ్వక’ర్మణః సమ’వర్తతాధి’ |
తస్య త్వష్టా’ విదధ’ద్రూపమే’తి | తత్పురు’షస్య విశ్వమాజా’నమగ్రే” ||2-1
సమస్త రసములు కలిగిన భూమి జలము నుండి ప్రకటిత మయినది (పుట్టినది)
ఇది పరమేశ్వరుడు అయిన "విశ్వకర్మ" వలెనే జరిగినది.
ఈ బ్రహ్మాండమునకు ఆ పరమేశ్వరుడి అంశమైన విరాట్ పురుషుడు త్వష్టర్విశ్వకర్మ యజమాని .
ఆ పురుషుడే జగద్రూపమును పొందెను.
(జగదీశ్వరుడు అయిన విశ్వబ్రహ్మ ఆ పురుషునకు జగద్రూపము అనుగ్రహించెను)
వేదాహమేతం పురు’షం మహాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సః పర’స్తాత్ |
తమేవం విద్వానమృత’ ఇహ భ’వతి | నాన్యః పంథా’ విద్యతేஉయ’నాయ ||2-2
ఇట్టి పరమ పురుషుని మహా గొప్ప మహిమాన్వితునిగాను, అజ్నానమునకు పరమున ఉన్న సూర్య ప్రకాశము (సవిత) కూడా తనే (విశ్వకర్మ యే) అయి ఉన్నాడని తెలుసుకొను వారు మహా జ్ఞానులు వారు ఈ భులోకమునుంచే అమ్రుతులగుదురు (మోక్ష ప్రాప్తి), మోక్షానికి ఇంతకంటే వేరు మార్గము లేదు.
(గమనిక:-ఈ విషయము ప్రజలకు తెలియ కూడదని రాజులను మభ్య పెట్టి కుట్రలు ద్వారా వేదం చదివితే నాలుక కోసేయ బడును వింటే చెవిలో సీసం పోసేయ బడును అని ఆజ్ఞలు చేయించి నిజాన్ని కనుమరుగు పరిచారు, ఈ విధంగా ప్రజలను సంస్కృత భాషకు వేద విద్యకు దూరం చేసారు. పరమేశ్వరుడైన విశ్వబ్రహ్మ లేక విశ్వకర్మ యొక్క నాభి నుంచి ఉద్భవించిన కమలం ద్వారా పుట్టిన వాడే విరాట్ పురుషుడు అనగా త్వష్టర్విశ్వకర్మ, వీరిద్దరిని పురాణముల లో అనగా విశ్వబ్రహ్మ (విశ్వకర్మ) ను విష్ణు గాను త్వష్టబ్రహ్మ ను చతుర్ముఖ బ్రహ్మ గాను పురాణముల లో వక్రీకరించిరి/చిత్రీకరించితిరి, తరువాత కొంత కాలానికి అనగా ప్రజలు సంస్కృతం భాష జ్ఞానం కోల్పోయిన తరువాత వారికి అనుగుణంగా ఉన్న పురాణములు ప్రజల మధ్యకు ప్రవేశ పెట్టిరి.)
(తదుపరి ధారావాహిక:- 7 లో ఇంకా ఉంది).
No comments:
Post a Comment