విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Tuesday, March 12, 2013

పురుష సూక్తం ధారావాహిక:-7


పురుష సూక్తం ధారావాహిక:-7
ప్రజాప’తిశ్చరతి గర్భే’ అంతః | అజాయ’మానో బహుధా విజా’యతే |
తస్య ధీరాః పరి’జానంతి యోనిమ్” | మరీ’చీనాం పదమిచ్ఛంతి వేధసః’ ||2-3
ప్రజాపతి పుట్టుక లేని వాడైనను ఈ బ్రహ్మాండములో నున్నను ఆయన (ప్రజాపతి విశ్వబ్రహ్మ) ఈయన (విరాట్ పురుషుడు లేక విశ్వకర్మ లేక త్వష్టర్విశ్వకర్మ) ప్రపంచమునన అనేక రూపములు గా పుట్టెను. (శంకరుడు,విష్ణు,బ్రహ్మ లేక త్వష్ట,ఇంద్రుడు,సూర్యుడు విశ్వే దేవతలు అనగా విశ్వమంతా ఉన్న దేవతలు).
జ్ఞానులు ఆ విరాట్ విశ్వకర్మ ప్రజాపతి యొక్క స్వరూపము నేరుంగుచున్నారు (లేక బ్రహ్మాండ నాభిని లేక ఆ హిరణ్య గర్భుడను).
మరీచ్యాది మున్నగు బ్రహ్మఋషులు వారి స్థానములను కోరుచున్నారు.
యో దేవేభ్య ఆత’పతి | యో దేవానాం” పురోహి’తః |
పూర్వో యో దేవేభ్యో’ జాతః | నమో’ రుచాయ బ్రాహ్మ’యే ||2-4
దేవతల కొరకు సర్వత్ర ప్రకాశించు వాడునూ (లేక సకల దేవతలకు మూల పురుషుడై ఉన్నాడో), ఎవరు పూర్వము నుంచి దేవతలకు హితుడై ఉన్నాడో (లేక దేవతలకే పురోహితుడై ఉన్నాడో లేక పురోభివృద్ది కాంక్షించి ఉన్నాడో), దేవతల కంటే పూర్వమే ఉద్భవించి ఉండినటువంటి వాడును అగు ఆ పరబ్రహ్మమునకు నమస్కారం.
రుచం’ బ్రాహ్మం జనయ’ంతః | దేవా అగ్రే తద’బ్రువన్ |
యస్త్వైవం బ్రా”హ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే” ||2-5
సృష్టి యొక్క ఆది యందు సమస్త దేవతలు, పరబ్రహ్మమును గూర్చి పైన చెప్పిన విధముగా తెలుసుకొనిన జ్ఞానికి సమస్త దేవతలును వశమై ఉందురు.
హ్రీశ్చ’ తే లక్ష్మీశ్చ పత్న్యౌ” | అహోరాత్రే పార్శ్వే |
నక్ష’త్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్” |

లక్ష్మి దేవియును (లక్ష్మి అనగా ధనము లేక జ్ఞాణాగ్ని) శ్రిదేవియును (ఆది శక్తి లేక గాయత్రీ లేక శబ్ద బ్రహ్మము లేక నాద బ్రహ్మము) నీకు భార్యలు. రాత్రి పగలు పార్శములు.ఆశ్వన్యాది నక్షత్రములు నీ రూపము.అశ్వని దేవతలు నీ నోరు.
ఇష్టం మ’నిషాణ | అముం మ’నిషాణ | సర్వం’ మనిషాణ || 2-6
ఓ దేవా మేము కోరునట్టి జ్ఞానము ప్రసాదింపుము, ఆత్మజ్ఞానమును దయ చేయుము, సర్వమైన ఐహికాముశ్మికములను అనుగ్రహింపుము అని ప్రార్దిన్చిరి.
ఇంతటి తో పురుష సూక్తం పరిపూర్ణం. జ్ఞానవంతులైన ప్రజలందరూ ఈ విధంగా తెలుసుకుని దైవ కార్యములు చేయుదురని నా ఆశ ఆకాంక్ష మరియు ప్రార్దన.
తదుపరి అతి త్వరలో మిత్రుల కోరిక మీద సకల వేద,శాస్త్ర,ఖురాన్,పురాణ ,ఇతిహాసములలో సర్వశ్రేష్ట మరియు పురుష సూక్తము లో తెలిపిన విశ్వ సృష్టికర్త నిరాకార,నిర్గుణ, గుణాతీత, కర్మాతీత, పరమాత్ముడు, పరమేశ్వరుడు, పరబ్రహ్మ అయిన విశ్వబ్రహ్మ యొక్క విశ్వకర్మ సూక్తం సమర్పించుకుంటాను, ఈ సుక్తమునకు మించిన సూక్తం మరి విశ్వంలో లేనే లేదు! ఈ తత్వాన్నే మన మహమ్మదీయ భక్తులు మిత్రులు ఉర్దూ భాష లో "అల్లాహ్" అనే పేరు తో ప్రార్దించుకుంటారు.
ఇది సత్యం నిత్యం నిరంజనం. పరమాత్ముడు ఒక్కడే విశ్వానికి అంతటికి అతనొక్కడే నమస్కార యోగ్యుడు.
గమనిక:- తమరందరకు ఇది నా "మనవి":- ఇక్కడ ఇచ్చిన చిత్రాలు (ఫోటోలు) కేవలం అర్ధం అవుటకు ఇచ్చినవి మాత్రమే, యేమనిన పరమాత్మ నిరాకారుడు. సాకారం అనుకున్నా కాని ఆ స్వరూపం వర్ణించటం మానవ మాత్రులకు అసాధ్యం, ఆ స్వరూపం వర్ణనాతీతం.. జ్ఞానులైన తమరందరూ దయ చేసి అర్ధం చేసుకుంటారని ప్రార్దన.

*****సమాప్తం******

No comments: