విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Thursday, September 19, 2013

జై విశ్వకర్మ

జై విశ్వకర్మ



Wednesday, September 18, 2013

జై విశ్వకర్మ ఈ రోజు విశ్వకర్మ పూజ మా దేవాలయ ప్రాంగణములో మరియు విశ్వకర్మ ఝండా ఆవిష్కరణ






జై విశ్వకర్మ
ఈ రోజు విశ్వకర్మ పూజ మా దేవాలయ ప్రాంగణములో మరియు విశ్వకర్మ ఝండా ఆవిష్కరణ


Friday, June 7, 2013

Erection of Flag of Lord Viswakarma



Erection of Flag of Lord Viswakarma

Monday, June 3, 2013

పరమాత్మ విశ్వకర్మ ధ్వజ నిర్మాణం

పరమాత్మ విశ్వకర్మ ధ్వజ నిర్మాణం

Wednesday, May 29, 2013

परमात्म विश्वकर्मा द्वझ निर्मान

परमात्म विश्वकर्मा द्वझ निर्मान

Saturday, April 13, 2013

పక్షుల దాహార్తి తిర్చడానికి ఏర్పాటు

పక్షుల దాహార్తి తిర్చడానికి ఏర్పాటు

Sunday, April 7, 2013

హిందు ధర్మం అంటే ఏమిటి?

హిందు ధర్మం అంటే ఏమిటి? నేను హిందువుని ఎందుకు అయ్యాను?

మిగిలిన మతాలవలే కాకుండా, హిందు ధర్మం స్వర్గం/నరకం అనే మూఢ విశ్వాసం మీద ఆధారపడిలేదు. కొన్ని మూఢవిశ్వాసాలను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మమని చెప్పేది కాదు హిందు ధర్మం ! హిందు ధర్మం దేనిని గుడ్డిగా నమ్మమని చెప్పదు, దేనిలో అయినా సత్యాన్ని పరిశోధించి తెలుసుకోమని బోధిస్తుంది. ఈ ప్రపంచంతరువాత స్వర్గం/నరకం అనేవి లేవు. కేవలం మన కర్మలే జీవితాన్ని స్వర్గం/నరకం అయ్యేలా చేస్తాయి.

హిందువు యొక్క ధర్మం ఏమిటంటే ప్రకృతిని, చుట్టూ ఉండే తోటి ప్రాణులను కాపాడడం !ఈ ప్రపంచంలో చెడు అనేది ఏమి లేదు, అంతా దైవత్వమే ! మన శరీరంలానే ఈ విశ్వం కూడా పంచభూతాలతో సృష్టింపబడినది. అంటే మన శరీరం కూడా చిన్న విశ్వంలాంటిదే! మన లోపల ఎలాగైతే తెలివి, జ్ఞానం, ఆత్మ ఉంటాయో అలానే ఈ విశ్వం లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు !

దేవుడు అనేవాడు ఒక వ్యక్తి/జీవం కాదు. దేవుడు అంటే పవిత్రమైన, అనంతమైన శక్తి. శివుదు(పరమాత్మ), గౌరీ మాత( శక్తి) కలయిక వలనే ఈ విశ్వం సృష్టిపబడుతూ ఉంటుంది. పరమాత్మను తెలుసుకుని మన ఆత్మను ఐక్యం చేయడమే ఆత్మ సాక్షాత్కారం ! అదే మన జీవిత గమ్యం మరియు ఇదే సులభమైన/ఉత్తమమైన మార్గం !

హిందు ధర్మం లొ శాస్త్రీయత/విజ్ఞానం ఉంది ! హిందు ధర్మం ద్వారా మీకు సత్యం తెలుసుకోవాలని లేకపోతే ఇతరులను బాధపెట్టకుండా మీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. దానినే ధర్మం అంటారు.

మతం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఎందుకంటే అది మూఢ విశ్వాసలపై ఆధారపడి ఉంటుంది.

ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది ఎందుకంటే అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది.

హిందు ధర్మం లోకి అందరికి స్వాగతం: సత్యాన్ని పరమాత్మను తెలుసుకోండి !

--------------------------------
"లోక సమస్త సుఖినో భవంతు !"

 

Wednesday, April 3, 2013

పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారు ఇచ్చిన ఉత్తరువులు

 శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు గురించి ఇటీవల కాలం లో జరిగిన పుస్తక ఆవిష్కరణ పై శ్రీ పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారు ఇచ్చిన ఉత్తరువులు



Tuesday, March 12, 2013

పురుష సూక్తం ధారావాహిక:-7


పురుష సూక్తం ధారావాహిక:-7
ప్రజాప’తిశ్చరతి గర్భే’ అంతః | అజాయ’మానో బహుధా విజా’యతే |
తస్య ధీరాః పరి’జానంతి యోనిమ్” | మరీ’చీనాం పదమిచ్ఛంతి వేధసః’ ||2-3
ప్రజాపతి పుట్టుక లేని వాడైనను ఈ బ్రహ్మాండములో నున్నను ఆయన (ప్రజాపతి విశ్వబ్రహ్మ) ఈయన (విరాట్ పురుషుడు లేక విశ్వకర్మ లేక త్వష్టర్విశ్వకర్మ) ప్రపంచమునన అనేక రూపములు గా పుట్టెను. (శంకరుడు,విష్ణు,బ్రహ్మ లేక త్వష్ట,ఇంద్రుడు,సూర్యుడు విశ్వే దేవతలు అనగా విశ్వమంతా ఉన్న దేవతలు).
జ్ఞానులు ఆ విరాట్ విశ్వకర్మ ప్రజాపతి యొక్క స్వరూపము నేరుంగుచున్నారు (లేక బ్రహ్మాండ నాభిని లేక ఆ హిరణ్య గర్భుడను).
మరీచ్యాది మున్నగు బ్రహ్మఋషులు వారి స్థానములను కోరుచున్నారు.
యో దేవేభ్య ఆత’పతి | యో దేవానాం” పురోహి’తః |
పూర్వో యో దేవేభ్యో’ జాతః | నమో’ రుచాయ బ్రాహ్మ’యే ||2-4
దేవతల కొరకు సర్వత్ర ప్రకాశించు వాడునూ (లేక సకల దేవతలకు మూల పురుషుడై ఉన్నాడో), ఎవరు పూర్వము నుంచి దేవతలకు హితుడై ఉన్నాడో (లేక దేవతలకే పురోహితుడై ఉన్నాడో లేక పురోభివృద్ది కాంక్షించి ఉన్నాడో), దేవతల కంటే పూర్వమే ఉద్భవించి ఉండినటువంటి వాడును అగు ఆ పరబ్రహ్మమునకు నమస్కారం.
రుచం’ బ్రాహ్మం జనయ’ంతః | దేవా అగ్రే తద’బ్రువన్ |
యస్త్వైవం బ్రా”హ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే” ||2-5
సృష్టి యొక్క ఆది యందు సమస్త దేవతలు, పరబ్రహ్మమును గూర్చి పైన చెప్పిన విధముగా తెలుసుకొనిన జ్ఞానికి సమస్త దేవతలును వశమై ఉందురు.
హ్రీశ్చ’ తే లక్ష్మీశ్చ పత్న్యౌ” | అహోరాత్రే పార్శ్వే |
నక్ష’త్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్” |

లక్ష్మి దేవియును (లక్ష్మి అనగా ధనము లేక జ్ఞాణాగ్ని) శ్రిదేవియును (ఆది శక్తి లేక గాయత్రీ లేక శబ్ద బ్రహ్మము లేక నాద బ్రహ్మము) నీకు భార్యలు. రాత్రి పగలు పార్శములు.ఆశ్వన్యాది నక్షత్రములు నీ రూపము.అశ్వని దేవతలు నీ నోరు.
ఇష్టం మ’నిషాణ | అముం మ’నిషాణ | సర్వం’ మనిషాణ || 2-6
ఓ దేవా మేము కోరునట్టి జ్ఞానము ప్రసాదింపుము, ఆత్మజ్ఞానమును దయ చేయుము, సర్వమైన ఐహికాముశ్మికములను అనుగ్రహింపుము అని ప్రార్దిన్చిరి.
ఇంతటి తో పురుష సూక్తం పరిపూర్ణం. జ్ఞానవంతులైన ప్రజలందరూ ఈ విధంగా తెలుసుకుని దైవ కార్యములు చేయుదురని నా ఆశ ఆకాంక్ష మరియు ప్రార్దన.
తదుపరి అతి త్వరలో మిత్రుల కోరిక మీద సకల వేద,శాస్త్ర,ఖురాన్,పురాణ ,ఇతిహాసములలో సర్వశ్రేష్ట మరియు పురుష సూక్తము లో తెలిపిన విశ్వ సృష్టికర్త నిరాకార,నిర్గుణ, గుణాతీత, కర్మాతీత, పరమాత్ముడు, పరమేశ్వరుడు, పరబ్రహ్మ అయిన విశ్వబ్రహ్మ యొక్క విశ్వకర్మ సూక్తం సమర్పించుకుంటాను, ఈ సుక్తమునకు మించిన సూక్తం మరి విశ్వంలో లేనే లేదు! ఈ తత్వాన్నే మన మహమ్మదీయ భక్తులు మిత్రులు ఉర్దూ భాష లో "అల్లాహ్" అనే పేరు తో ప్రార్దించుకుంటారు.
ఇది సత్యం నిత్యం నిరంజనం. పరమాత్ముడు ఒక్కడే విశ్వానికి అంతటికి అతనొక్కడే నమస్కార యోగ్యుడు.
గమనిక:- తమరందరకు ఇది నా "మనవి":- ఇక్కడ ఇచ్చిన చిత్రాలు (ఫోటోలు) కేవలం అర్ధం అవుటకు ఇచ్చినవి మాత్రమే, యేమనిన పరమాత్మ నిరాకారుడు. సాకారం అనుకున్నా కాని ఆ స్వరూపం వర్ణించటం మానవ మాత్రులకు అసాధ్యం, ఆ స్వరూపం వర్ణనాతీతం.. జ్ఞానులైన తమరందరూ దయ చేసి అర్ధం చేసుకుంటారని ప్రార్దన.

*****సమాప్తం******

పురుష సూక్తం ధారావాహిక:-6


పురుష సూక్తం ధారావాహిక:-6

వేదాహమే’తం పురు’షం మహాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సస్తు పారే |
సర్వా’ణి రూపాణి’ విచిత్య ధీరః’ | నామా’ని కృత్వా‌உభివదన్, యదా‌உ‌உస్తే” ||1-16

ధీరుడై క్రియా శీలుడై, సమస్త రూపములను సృష్టించి, వానికి నామకరణం కావించి (పేర్లు పెట్టి) అంతటను వ్యాపించి ఉండి పాలిస్తున్న, సూర్యుని యొక్క ప్రకాశము కుడా అతనే అయి ఉన్నాడని నేను తెలుసు కొనుచున్నాను, అతను అజ్ఞానము అనే అందకారమునకు ఆవల ఉన్నాడు.

ధాతా పురస్తాద్యము’దాజహార’ | శక్రః ప్రవిద్వాన్-ప్రదిశశ్చత’స్రః |
తమేవం విద్వానమృత’ ఇహ భ’వతి | నాన్యః పంథా అయ’నాయ విద్యతే ||1-17

ధాత అయిన త్వష్ట బ్రహ్మ(పురాణములో చతుర్ముఖ బ్రహ్మగా వర్ణించిన) చే చెప్పబడిన వాడును, ఇంద్రుని చే నెరుగబడి నలుదిక్కుల ప్రసిద్దినొంది ఉన్నవాడగు విరాట్ పురుషుని ఈ ప్రకారముగా తెలుసు కొనిన, ఈ జన్మ నుంచే అమ్రుతులు కాగలరు, వేరే మార్గము వెతకనవసరము లేదు

యఙ్ఞేన’ యఙ్ఞమ’యజంత దేవాః | తాని ధర్మా’ణి ప్రథమాన్యా’సన్ |
తే హ నాకం’ మహిమానః’ సచంతే | యత్ర పూర్వే’ సాధ్యాస్సంతి’ దేవాః ||1-18

దేవతలు తమ మానస యజ్ఞము చే యజ్ఞ రూపుడగు ఆ విరాట్ పురుషుని ఉద్భవింపజేసిరి, అతని ధర్మములే ముఖ్యము లాయెను, ఆ విరాట్ పురుషుని గూర్చి జ్ఞాన మొందిన మహానుభావులు పూర్వపు సాధ్యులు ఉండునట్టి స్వర్గమును ఈ భులోకమునే పొందెదరు.

ద్వితీయానువాకము

అద్భ్యః సంభూ’తః పృథివ్యై రసా”చ్చ | విశ్వక’ర్మణః సమ’వర్తతాధి’ |
తస్య త్వష్టా’ విదధ’ద్రూపమే’తి | తత్పురు’షస్య విశ్వమాజా’నమగ్రే” ||2-1

సమస్త రసములు కలిగిన భూమి జలము నుండి ప్రకటిత మయినది (పుట్టినది)

ఇది పరమేశ్వరుడు అయిన "విశ్వకర్మ" వలెనే జరిగినది.

ఈ బ్రహ్మాండమునకు ఆ పరమేశ్వరుడి అంశమైన విరాట్ పురుషుడు త్వష్టర్విశ్వకర్మ యజమాని .

ఆ పురుషుడే జగద్రూపమును పొందెను.

(జగదీశ్వరుడు అయిన విశ్వబ్రహ్మ ఆ పురుషునకు జగద్రూపము అనుగ్రహించెను)

వేదాహమేతం పురు’షం మహాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సః పర’స్తాత్ |
తమేవం విద్వానమృత’ ఇహ భ’వతి | నాన్యః పంథా’ విద్యతే‌உయ’నాయ ||2-2

ఇట్టి పరమ పురుషుని మహా గొప్ప మహిమాన్వితునిగాను, అజ్నానమునకు పరమున ఉన్న సూర్య ప్రకాశము (సవిత) కూడా తనే (విశ్వకర్మ యే) అయి ఉన్నాడని తెలుసుకొను వారు మహా జ్ఞానులు వారు ఈ భులోకమునుంచే అమ్రుతులగుదురు (మోక్ష ప్రాప్తి), మోక్షానికి ఇంతకంటే వేరు మార్గము లేదు.

(గమనిక:-ఈ విషయము ప్రజలకు తెలియ కూడదని రాజులను మభ్య పెట్టి కుట్రలు ద్వారా వేదం చదివితే నాలుక కోసేయ బడును వింటే చెవిలో సీసం పోసేయ బడును అని ఆజ్ఞలు చేయించి నిజాన్ని కనుమరుగు పరిచారు, ఈ విధంగా ప్రజలను సంస్కృత భాషకు వేద విద్యకు దూరం చేసారు. పరమేశ్వరుడైన విశ్వబ్రహ్మ లేక విశ్వకర్మ యొక్క నాభి నుంచి ఉద్భవించిన కమలం ద్వారా పుట్టిన వాడే విరాట్ పురుషుడు అనగా త్వష్టర్విశ్వకర్మ, వీరిద్దరిని పురాణముల లో అనగా విశ్వబ్రహ్మ (విశ్వకర్మ) ను విష్ణు గాను త్వష్టబ్రహ్మ ను చతుర్ముఖ బ్రహ్మ గాను పురాణముల లో వక్రీకరించిరి/చిత్రీకరించితిరి, తరువాత కొంత కాలానికి అనగా ప్రజలు సంస్కృతం భాష జ్ఞానం కోల్పోయిన తరువాత వారికి అనుగుణంగా ఉన్న పురాణములు ప్రజల మధ్యకు ప్రవేశ పెట్టిరి.)

(తదుపరి ధారావాహిక:- 7 లో ఇంకా ఉంది).

పురుష సూక్తం ధారావాహిక:-5

పురుష సూక్తం ధారావాహిక:-5

తస్మాదశ్వా’ అజాయంత | యే కే చో’భయాద’తః |
గావో’ హ జఙ్ఞిరే తస్మా”త్ | తస్మా”జ్జాతా అ’జావయః’ ||1-11
ఆ మానస యజ్ఞము నుండి గుఱ్ఱములును, నోటిలో పైన మరియు క్రింద భాగములలో దంతములు కల గాడిదలును, ఆవులును, మేకలును,గొర్రెలను,పుట్టెను.
యత్పురు’షం వ్య’దధుః | కతిథా వ్య’కల్పయన్ |
ముఖం కిమ’స్య కౌ బాహూ | కావూరూ పాదా’వుచ్యేతే ||1-12
దేవతలు విరాట్ పురుషుని, వారి మానస యజ్ఞ సంకల్పము చే ఉద్భవింప చేసినపుడు ఆతని ముఖము ని బాహువులను కడుపును పాదములను అనేక విధములు కల్పన చేసిరి ,
బ్రాహ్మణో”உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః |
ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్మ్ శూద్రో అ’జాయతః ||1-13
ముఖము బ్రాహ్మణులు అయినటుల, బాహువులు క్షత్రియులు అయినటుల, కడుపు వైశ్యులైనటుల మరియు శూద్రులు పాదముల ద్వారా పుట్టినట్లు ఉహించిరి,
చంద్రమా మన’సో జాతః | చక్షోః సూర్యో’ అజాయత |
ముఖాదింద్ర’శ్చాగ్నిశ్చ’ | ప్రాణాద్వాయుర’జాయత ||1-14
ఆ విధముగానే మనస్సు నుండి చంద్రుడు ను, నేత్రముల నుండి సూర్యుడును, ముఖమునుండి ఇంద్రాగ్నియును, ప్రాణము నుండి వాయువును పుట్టిరి,
నాభ్యా’ ఆసీదంతరి’క్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమ’వర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రా”త్ | తథా’ లోకాగ్మ్ అక’ల్పయన్ ||1-15
అతని నాభి నుండి అంతరిక్షమును ఏర్పడెను, ఆయన శిరము వలన స్వర్గము, పాదముల వలన భూమి ను, చెవుల నుండి దిశలు ను అని దేవతలు కల్పించిరి (ఉహించిరి).
(తదుపరి ధారావాహిక:-6 లో ఇంకా ఉంది).
గమనిక:- తమరందరకు ఇది నా "మనవి":- ఇక్కడ ఇచ్చిన చిత్రాలు(ఫోటోలు) కేవలం అర్ధం అవుటకు ఇచ్చినవి మాత్రమే, యేమనిన పరమాత్మ నిరాకారుడు. సాకారం అనుకున్నా కాని ఆ స్వరూపం వర్ణించటం మానవ మాత్రులకు అసాధ్యం, ఆ స్వరూపం వర్ణనాతీతం.. జ్ఞానులైన తమరందరూ దయ చేసి అర్ధం చేసుకుంటారని ప్రార్దన.
(మీ, ఆచార్యవిశ్వబ్రహ్మ @ నామగిరి గణపతి రమణాచార్య)

Tuesday, February 12, 2013

పురుష సూక్తం ధారావాహిక:-4

పురుష సూక్తం ధారావాహిక:-4

తేన’ దేవా అయ’జంత | సాధ్యా ఋష’యశ్చ యే ||
తస్మా”ద్యఙ్ఞాత్-స’ర్వహుతః’ | సంభృ’తం పృషదాజ్యమ్ |
పశూగ్-స్తాగ్శ్చ’క్రే వాయవ్యాన్’ | ఆరణ్యాన్-గ్రామ్యాశ్చ యే ||
తస్మా”ద్యఙ్ఞాత్స’ర్వహుతః’ | ఋచః సామా’ని జఙ్ఞిరే |
ఛందాగ్మ్’సి జఙ్ఞిరే తస్మా”త్ | యజుస్తస్మా’దజాయత ||
భావము:- అట్లు దేవతలు, సాధ్యులు, ఋషులు కలసి చేసిన యజ్ఞరూప యజ్ఞ పురుషుని యొక్క మానస యజ్ఞము నుండి వృషత్ అనే నేయి ఉత్పన్నం అయినది (సంపాదింప బడెను). వాయు దేవతాకములగు పశువులును, అరణ్యములో, గ్రామములో నుండు జంతువులు (లేడి, దుప్పెలు, ఆవులు, కోళ్ళు, పక్షులు వగైరా") మున్నగునవియు, ఋక్కులు, సామములు (వేదములు), గాయత్రీ మున్నగు ఛందస్సులు మరియు యజస్సులు (యజుర్వేదం) ఉద్భవించినవి (పుట్టినవి).
(తదుపరి ధారావాహిక:-5 లో ఇంకా ఉంది).
గమనిక:- తమరందరకు ఇది నా "మనవి":- ఇక్కడ ఇచ్చిన చిత్రాలు(ఫోటోలు) కేవలం అర్ధం అవుటకు ఇచ్చినవి మాత్రమే, యేమనిన పరమాత్మ నిరాకారుడు. సాకారం అనుకున్నా కాని ఆ స్వరూపం వర్ణించటం మానవ మాత్రులకు అసాధ్యం, ఆ స్వరూపం వర్ణనాతీతం.. జ్ఞానులైన తమరందరూ దయ చేసి అర్ధం చేసుకుంటారని ప్రార్దన.
(ఆచార్యవిశ్వబ్రహ్మ/NGR)

Sunday, February 10, 2013

పురుష సూక్తం ధారావాహిక:-3

పురుష సూక్తం ధారావాహిక:-3

యత్పురు’షేణ హవిషా” | దేవా యఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||
సప్తాస్యా’సన్-పరిధయః’ | త్రిః సప్త సమిధః’ కృతాః |
దేవా యద్యఙ్ఞం త’న్వానాః | అబ’ధ్నన్-పురు’షం పశుమ్ ||
తం యఙ్ఞం బర్హిషి ప్రౌక్షన్’ | పురు’షం జాతమ’గ్రతః |

భావము:- దేవతలు ఒక మానస యజ్ఞము చేసితిరి! ఆ విరాట్ పురుషునే హవిస్సులు గా భావించి, అందుకు వసంత ఋతువు నేయి గా, గ్రీష్మము సమిధి గా, శరదృతువు హవిస్సు గా అయినవి (భావించిరి), ఆ యజ్ఞమునకు గాయత్రి మున్నగు ఛందస్సులు ఏడు మేరలుగాను ఆ ఏడింటి తోనే ఏర్పడిన ఇరువది వొక్కింటిని సమిధలు గా భావించిరి! వారు ఆ పురుష పశువును స్థూపమునకు కట్టి విశనము చేసిరి.
(వివరణ:- ప్ర ప్రథమంగా ఆ విరాట్ పురుషుడు నుంచి ఉద్భవించిన (సృష్టించిన) దేవతలు పంచ ఋషులు సానగ లేక మను (శివుడు) సనాతన లేక మయ (విష్ణు) ఆహాభున లేక త్వష్ట (ఇతనినే పురాణములో చతుర్ముఖ బ్రహ్మ గా వర్ణించినారు) ప్రత్న లేక దైవజ్ఞ లేక శిల్పి (ఇంద్రుడు) సుపర్ణ లేక విశ్వజ్ఞ (సూర్యుడు), ఈ పంచ ఋషులు సృష్టిని పాలన (నడుపుటకై) చేయు సామర్ధ్యం కొరకు ఒక మానస యజ్ఞము చేయదలచిరి! ఆ యజ్ఞమునకు హవిస్సులు లేనందున ఆ విరాట్ పురుష స్వరూపము నే హవిస్సు గా భావించి, అందుకు వసంత ఋతువు నేయి గా, గ్రీష్మము సమిధి గా, శరదృతువు హవిస్సు గా భావన చేసిరి, ఆ యజ్ఞమునకు గాయత్రి మున్నగు ఛందస్సులు ఏడు మేరలుగాను ఆ ఏడింటి తోనే ఏర్పడిన ఇరువది వొక్కింటిని సమిధలు గా భావించిరి! వారు ఆ పురుష పశువును స్థూపమునకు కట్టి విశనము చేసిరి). (తదుపరి ధారావాహిక:-4 లో ఇంకా ఉంది).
గమనిక:- తమరందరకు ఇది నా "మనవి":- ఇక్కడ ఇచ్చిన చిత్రాలు(ఫోటోలు) కేవలం అర్ధం అవుటకు ఇచ్చినవి మాత్రమే, యేమనిన పరమాత్మ నిరాకారుడు. సాకారం అనుకున్నా కాని ఆ స్వరూపం వర్ణించటం మానవ మాత్రులకు అసాధ్యం, ఆ స్వరూపం వర్ణనాతీతం.. జ్ఞానులైన తమరందరూ దయ చేసి అర్ధం చేసుకుంటారని ప్రార్దన.

(ఆచార్యవిశ్వబ్రహ్మ/NGR)

Friday, January 25, 2013

పురుష సూక్తం ధారావాహిక:-2


పురుష సూక్తం ధారావాహిక:-2
పాదో”உస్య విశ్వా’ భూతాని’ | త్రిపాద’స్యామృతం’ దివి ||
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురు’షః | పాదో”உస్యేహాஉஉభ’వాత్పునః’ |
తతో విష్వణ్-వ్య’క్రామత్ | సాశనానశనే అభి ||
తస్మా”ద్విరాడ’జాయత | విరాజో అధి పూరు’షః |
స జాతో అత్య’రిచ్యత | పశ్చాద్-భూమిమథో’ పురః ||
విరాట్ పురుషుడు (విశ్వం) ఆ పరమాత్ముని యొక్క నాల్గవ భాగం మాత్రమే, ఆ శక్తి యొక్క మిగిలిన మూడు భాగములు స్వయం ప్రకాశ రూపము నందు నాశ రహితమై ఉన్నది, మరియు జనన మరణ గుణ రహితమై ఉన్నది. కేవలం ఆ నాల్గవ భాగము మాత్రమే మాయ ను పొంది సృష్టి, పాలనా, సంహార, కార్యములను చేయుచున్నది, సర్వత్ర వ్యాపించు చున్నది, మయా సంబంధము కలిగిన తరువాత దేవ మర్త్య తిర్యక్ లు మున్నగు చేతనా చేనముల (ఆత్మ) యందు వ్యాపించి ఉన్నది, ఆ పరమశక్తి తన నుంచే తను తనంతట తానుగా విరాట్ పురుషుడు గా ప్రభవించి భూమిని సృష్టించెను, పిమ్మట దేవ, మనుష్య, తిర్యక్కులు మొదలగు వాని సప్త ధాతువుల దేహములను సృష్టించెను. అందలి సకల దేహములందు ఆత్మ రూపముగా వ్యాపించి ఉన్నాడు. (తదుపరి ధారావాహిక:-3 లో ఇంకా ఉంది).
గమనిక:- తమరందరకు ఇది నా "మనవి":- ఇక్కడ ఇచ్చిన ఫోటోలు కేవలం అర్ధం అవుటకు ఇచ్చినవి మాత్రమే, యేమనిన పరమాత్మ నిరాకారుడు. సాకారం అనుకున్నా కాని ఆ స్వరూపం వర్ణించటం మానవ మాత్రులకు అసాధ్యం, ఆ స్వరూపం వర్ణనాతీతం. జ్ఞానులైన తమరందరూ దయ చేసి అర్ధం చేసుకుంటారని ప్రార్దన.
(ఆచార్యవిశ్వబ్రహ్మ/NGR)

పురుష సూక్తం ధారావాహిక:-1

పురుష సూక్తం ధారావాహిక:-1
సహస్ర’శీర్షా పురు’షః | సహస్రాక్షః సహస్ర’పాత్ |
స భూమిం’ విశ్వతో’ వృత్వా | అత్య’తిష్ఠద్దశాంగుళమ్ ||
పురు’ష ఏవేదగ్మ్ సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
ఉతామృ’తత్వ స్యేశా’నః | యదన్నే’నాతిరోహ’తి ||
ఏతావా’నస్య మహిమా | అతో జ్యాయాగ్’శ్చ పూరు’షః |
భావము :- 1000 ముఖములు 1000 కనులు, 1000 చేతులు, 1000 పాదములు దశ దిశలకు వ్యాపించి ఉన్నవి అనే వాక్యం అనుసరించి మనకు కనిపించు ప్రక్రుతి అంతయూ ప్రపంచము + జగత్తు, పరమాత్మ యొక్క విరాడ్రూపము. కావున ఆ పరమాత్మ ప్రపంచమందలి సమస్త జీవుల లో నున్నది, అందువలన ఆ శక్తి విశ్వబ్రహ్మం అయి ఉన్నది, దీనీనే ఋగ్వేదములో 10-81-3 సూక్తము నందు విశ్వమంతా కనులతో, విశ్వమంతా ముఖములతో, విశ్వమంతా హస్తములతో మరియు విశ్వమంతా పాదముల తో నిండి ఉన్న పరమ శక్తి అని వర్ణించినది, ఆ శక్తి సర్వాంతర్యామి మాత్రమె కాదు, ఆ శక్తి దశ దిశలకు ఆవల కూడా నిలయమై ఉన్న త్రికాల సత్య స్వరూప బ్రహ్మం, దేవాది దేవుడు ఆ పరమాత్మ ఈ జగదావస్తాను పొందగల్గిన శక్తి కంటే నూ మిగుల అధిక సామర్ధ్యం కల శక్తి. (తదుపరి ధారావాహిక:-2 లో ఇంకా ఉంది)
(ఆచార్యవిశ్వబ్రహ్మ/NGR)


Saturday, January 12, 2013



సంక్రాంతి శుభాకాంక్షలు

1900X1200

1024X768